లుంగీ అవతారంలో సచిన్, చిరు, నాగ్ | Sachin lungi avatar with Chiru and Nag

Sachin lungi avatar with chiru and nag

Sachin chiru and nag, sachin Kerala Blasters event, Sachin Kerala Blasters partners, Kerala Blasters owners, Sachin lungi avatar with Chiru and Nag, Chiru and nag in lungi, Sachin chiru and nag lungi, Kerala Blasters event

Sachin lungi avatar with Chiru and Nag at Kerala Blasters event.

లుంగీ అవతారంలో సచిన్ అండ్ పార్టనర్స్

Posted: 09/08/2016 10:23 AM IST
Sachin lungi avatar with chiru and nag

ప్రముఖ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ నిన్న సరికొత్త వస్త్రధారణలో కనిపించారు. కేరళలోని కొచిలో లుంగీ, టీ షర్టులో కనిపించిన ఆయన పక్కనే అదే వస్త్రధారణలో టాలీవుడ్ ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలు కూడా దర్శనమిచ్చారు. అయితా ఈ ముగ్గురు ఎలా కలిశారనేగా?

కేరళ బ్లాస్టర్స్ జట్టుకు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో పాటు.. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కూడా సహ యజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడీ కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ క్లబ్.. మూడో సీజన్ కు రెడీ అయిపోతున్న సందర్భంగా.. టీమ్ ను అనౌన్స్ చేసేందుకు అందరూ ప్లేయర్లతో పాటు యజమానులు కూడా ఒక చోటకు చేరారు. సచిన్ తో పాటు చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ తెల్ల లుంగీలు,  పసుపు రంగు టీషర్టుల్లో కొత్త లుక్ తో కనిపించారు. ఈ టీమ్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా మళయాళ యువహీరో నివిన్ పౌలీ. అదేనండీ.. చైతు ప్రేమమ్ ని రీమేక్ చేస్తున్నాడు కదా. దాని ఒరిజినల్ వర్షన్ హీరో..

ఇక ఇండియన్ సాకర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీ వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు నిన్న కొచిలో సదరు జట్టు సభ్యులను ప్రకటించిన సందర్భంగా లుంగీలు కట్టి మలయాళీల మాదిరి కనిపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin  Chiranjeevi  Nagarjuna  Kerala Blasters  

Other Articles