జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్ వాయిదా | Garage success meet postponed due to Ganesh immersion

Janatha garage success meet postponed due to ganesh immersion

Janatha garage Vizag success meet postpone, Janatha garage Vizag success meet, Janatha Garage success meet, NTR non baahubali records, Janatha Garage non baahubali records

Janatha garage Vizag success meet postponed due to Ganesh immersion.

గ్యారేజ్ సక్సెస్ మీట్ వాయిదా వేసేశారు

Posted: 09/07/2016 06:11 PM IST
Janatha garage success meet postponed due to ganesh immersion

'జనతా గ్యారేజ్' విడుదలైన రోజు టాక్ ఎలా ఉన్నా ప్రస్తుతం సృష్టిస్తున్న కలెక్షన్ల ప్రభంజనం చూస్తే ఎవరికైనా దిమ్మతిరగటం ఖాయం. విడుదలైన కేవలం ఆరంటే ఆరు రోజుల్లోనే ఈ సినిమా 60 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇప్పటికే ఓవరాల్ గా నాన్ బాహుబలి సినిమాల చరిత్రలో కేవలం ఐదురోజుల్లోనే మొదటిస్థానాన్ని ఆక్రమించిన జనతా... ఆరో రోజు చేరేటప్పటికి మిగిలిన సినిమాలకు అందనంతగా దూసుకుపోతుంది.  

ఓవర్సీస్ లో ఏ సౌత్ హీరోకి సాధ్యం కానీ రికార్డును ఎన్టీఆర్ క్రియేట్ చేశాడు. దీంతో ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని అందించిన ప్రేక్షకులకి .. అభిమానులకి ఈ సినిమా టీమ్ ధన్యవాదాలు తెలియజేయాలని అనుకుంది. అందుకోసం వైజాగ్ లో ఈ నెల 10వ తేదీన విజయోత్సవ వేడుకను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన చేశారు. ఆర్ కె బీచ్ లో దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ప్రారంభించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సిద్ధమైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే... ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని భావిస్తున్నారంట.

ప్రస్తుతం గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉన్నందున కొద్దిరోజుల దీనిని పోస్ట్ పోన్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రతా పరంగా కూడా ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉండటంతో మళ్లీ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తారంట. ఒకవేళ ఖచ్చితంగా అదే రోజున నిర్వహించాల్సి వస్తే మాత్రం వేదికను మార్చే ఆలోచన చేస్తుందట. ప్రస్తుతానికైతే నిర్మాతల దగ్గరి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Vizag success meet  postponed  

Other Articles