విడాకులపై అమల ఏమంటుంది? | amala paul talks about her divorce and future plans

Amala paul talks about her divorce and future plans

Amala Paul talks about divorce, Amala Paul talks about her future plans, Amala Paul break silence, Amala Paul upcoming movies, Amala Paul real reason for divorce, Amala Paul open about divorce, Amala Paul vijay separation, Amala Paul vijay divorce

Amala Paul talks about her divorce and future plans.

విడాకులకు అసలు కారణం చెప్పేసిందా?

Posted: 09/07/2016 12:52 PM IST
Amala paul talks about her divorce and future plans

విడాకుల వ్యవహారం ఒక ఎత్తు అయితే వరుస సినిమాలతో సౌత్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది నటి అమలాపాల్. వైవాహిక బంధం తెంచుకోవటంపై ఇంతదాకా భర్త విజయ్, అతని తండ్రి అళగప్పన్ ప్రెస్ మీట్లు పెట్టి గోల చేశారే తప్ప, ఎక్కడా అమలా నోరు విప్పిన దాఖలాలు లేవు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విడాకులపై ఇండైరక్ట్ గా స్పందించడమే కాదు... భర్త విజయన్ కు చురకలు కూడా అంటించింది.

పెళ్లి తర్వాత అమల సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోవటం మూలంగానే వారిద్దరు విడిపోయారంటూ అళగప్పన్ చెప్పటంతో సీన్ రివర్స్ అయ్యింది. అమలకు మద్ధతు పెరుగుతుండటంతో రంగంలోకి దిగిన విజయ్ అది అసలు కారణం కాదని, పర్సనల్ కారణాలతో తాము విడిపోతున్నామని, దయచేసి మీడియా ఈ విషయంలో పెద్దగా రాద్ధాంతం చేయొద్దని ఓ లేఖ రిలీజ్ చేశాడు. కానీ, అమల కెరీర్ కారణంగానే ఇదంతా జరుగుతుందనేది తెలిసిందే. మరి విడాకులపై అమల ఏమందో మీరే చూడండి.

''వేరే వారినుంచి లేదా వేరే వ్యక్తుల ద్వారా మనకు ఆనందం రాదు. ఆనందం కోసం వేరే వారిపై ఆధారపడొద్దు. మన కెరియర్ లోనే మనకు ఆనందం ఉంటుంది. ఆ కెరియర్ కు ఎవరు అడ్డుపడినా కూడా సహించాల్సిన అవసరం లేదు. అలాగే పనిలో ఆనందం దొరికినప్పుడు.. ఇక మనుషులతో పనేముంటుంది?'' అంటూ కామెంట్ చేసింది అమల. అంటే విడాకులకు కారణం అదేనని చెప్పకనే చెప్పటంతోపాటు, తన కెరీర్ కి అడ్డుతగులుతున్న భర్త నుంచి విడిపోయానని చెప్పకనే చెప్పేసింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  AL Vijay  divorce  future plans  

Other Articles