జనతా గ్యారేజ్ లో తానే లీడ్ అంటున్న నిత్యా మీనన్ | Nithya Menon says she is lead heroine in Janatha Garage

Nithya menon says she is lead heroine in janatha garage

Nithya Menon role in Janatha Garage, Nithaya about Janatha Garage, Nithya Menon in janatha garage promotions, nithya menon shocking comments on Janatha Garage

Nithya Menon says she is lead heroine in NTR's Janatha Garage.

హైప్ పెంచేందుకు ఆ కామెంట్లు చేసిందా?

Posted: 08/31/2016 03:57 PM IST
Nithya menon says she is lead heroine in janatha garage

ఇప్పుడున్న హీరోయిన్లలో సౌత్ లోని అన్ని భాషల్లో నటిస్తున్న ఏకైక హీరోయిన్ గా నిత్యామీనన్ కొత్త హిస్టరీ క్రియేట్ చేసిందనే చెప్పాలి. పాతతరం హీరోయిన్లలో ఇది మాములు వ్యవహారమే అయినా, కొత్త తరం హీరోయిన్లలో ఆ ఘనత మాత్రం నిత్యామీనన్ కే సొంతం అయ్యింది. పారితోషికం కన్నా ఆమె కథా బలానికి, క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వటం వాటితోనే హిట్లు కొట్టేయడం ఆమె ప్రత్యేకత. అయితే దాదాపు చేసిన పెద్ద సినిమా అన్నింట్లో ఆమె సెకండ్ హీరోయిన్ గా స్పెషల్ క్యారెక్టర్ లోనే నటించింది.

సన్నాఫ్ సత్యమూర్తి, 24 ఆ కోవలోకే వస్తాయి. దీంతో జనతా గ్యారేజ్ లో కూడా నిత్యది సెకండ్ హీరోయిన్ పాత్రేనని అంతా ఫిక్సయిపోయారు. ట్రైలర్ లో, పాటల్లో సమంతతోనే ఎన్టీఆర్ రొమాన్స్ చేయటం, ఆడియో వేడుకల్లో తప్ప , నిత్యా మీనన్ ఎక్కడా కనిపించకపోవటం ఈ విషయాన్నే దాదాపు కన్ఫర్మ్ చేసింది. అయితే తనదే మెయిన్ లీడ్ అని చెబుతోంది నిత్యామీనన్. తాజాగా చిత్ర ప్రమోషన్ లో జాయిన్ అయిన నిత్యా తన పాత్ర అంత తీసి పరేసేది కాదంటోంది. అసలు తానెంత మెయిన్ కేరక్టర్ చేసింది సినిమా చూస్తే తెలుస్తుందని, అప్పుడు ఆశ్చర్యపోక తప్పదని అంటోంది.

సందేశంతో కూడిన ఈ సినిమాను కమర్షియల్ సినిమాకంటే ఎక్కువగా తీయనున్నానని కొరటాల శివ చెప్పిన మాట తనకి బాగా నచ్చిందనీ, అందుకే ఈ సినిమాను తాను అంగీకరించానని వివరించింది. ఈ సినిమాలో తన పాత్ర ఎన్టీఆర్ పాత్రకి పూర్తి వ్యతిరేకంగా ఉంటుందనీ, అయినా ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడతాయని అంటోంది. ఆ విధంగా మెయిన్ లీడ్ తానేనంటూ సినిమా హైప్ ను మరింత పెంచేందుకు తన వంతు కృషి చేస్తోందీ పొట్టిపిల్ల.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithya Menon  NTR  janatha garage  

Other Articles