అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ షూటింగ్ లాంఛ్ | Allu Arjun Duvvada Jagannadham movie launched

Allu arjun duvvada jagannadham movie launched

Allu Arjun Duvvada Jagannadham, Duvvada Jagannadham movie launched, Duvvada Jagannadham movie, Bunny as DJ, Bunny DJ movie, DJ telugu movie, Allu Arjun DJ movie, DJ movie launched, Allu Arjun DJ director

Allu Arjun Duvvada Jagannadham movie launched under Harish Shankar Direction.

దువ్వాడ జగన్నాథమ్ మొదలుపెట్టేశారు

Posted: 08/29/2016 11:29 AM IST
Allu arjun duvvada jagannadham movie launched

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. సరైనోడు సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని, హరీష్ శంకర్ దర్శకత్వంలో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. హరీశ్ శంకర్ గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి 'DJ... దువ్వాడ జగన్నాథమ్' అనే వెరైటీ టైటిల్ ను అల్రెడీ ఫిక్స్ చేసి టైటిల్ లోగోను విడుదల చేశారు కూడా. ఫిలిం నగర్లోని దైవ సన్నిధానం వద్ద సోమవారం ఉదయం చిత్రం షూటింగ్ ను మొదలుపెట్టారు.

సరైనోడు సక్సెస్ తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న బన్నీ పక్కా స్క్రిప్ట్ తో ముందుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా ముందుగా బన్నీతో తీయాల్సి ఉన్నప్పటికీ అది మిస్ కావటంతో ఈసారి అవకాశాన్ని వదులుకోలేదు హరీష్ శంకర్. ఇప్పటికే చాలా రోజుల నుండి కథ మీద కసరత్తులు చేస్తున్న హరీశ్ శంకర్.. ఫైనల్ గా బ్రహ్మాండమైన కథతో పాటు కత్తిలాంటి డైలాగులు కూడా రెడీ చేశాడు. ఇక బన్నీతో 'ఆర్య', 'పరుగు' చిత్రాల తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రమిది. ఆ సంస్థకిది 25వ చిత్రం కావడం విశేషం.

టైటిల్ తో ఆసక్తిని రేపటంతోపాటు, క్రేజీ కాంబినేషన్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. త్వరలో మిగతా కాస్ట్ ను ఎంపిక చేసి, హడావుడి లేకుండా నిదానంగా సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి 27న చిత్రానికి విడుదల చేసే దిశగా ఫ్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ 8 ప్యాక్ లో కనిపించబోతున్నాడంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Harish Shankar  Duvvada Jagannadham  launch  

Other Articles