నాగార్జున పుట్టిన రోజు ప్రత్యేకం | Hero Akkineni Nagarjuna birthday special

Hero akkineni nagarjuna birthday special

Akkineni Nagarjuna birthday special, Nagarjuna birthday special, Hero Akkineni Nagarjuna, nag birthday special, nagarjuna nava manmadhudu, Akkineni birthday special, king nagarjuna birthday special, nagarjuna 57 birthday, special article on nagarjuna

Hero Akkineni Nagarjuna birthday special.

నాగ్ బర్త్ డే స్పెషల్

Posted: 08/29/2016 10:04 AM IST
Hero akkineni nagarjuna birthday special

ఆరు పదులకు అతి చేరువలో ఉన్నా ఈ కింగ్ ఇంకా నవ మన్మధుడే. అక్కినేని నాగేశ్వరావు నట వారసుడిగా తెరంగ్రేటం చేసి దాదాపు 30 ఏళ్ల కెరీర్ దాటి ఇంకా ఫుల్ జోష్ తో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. నాగ్ కెరీర్‌కి నో నీడ్ ఆఫ్ ఇంట్రో! నాగ్ స్టయిల్‌కి నో రిమార్క్! నాగ్ పర్సనాలిటీకి నో మ్యాచింగ్. ! 1959 ఆగష్టు 29న చెన్నైలో జన్మించిన ఈ అక్కినేని అందగాడు తండ్రి సుడిగుండాలు (1967) లో బాలనటుడిగా ఓ చిన్న రోల్ లో కనిపించాడు. ఆపై 1986లో విక్రమ్ ద్వారా పూర్తిస్థాయి హీరోగా తెరంగ్రేటం చేశాడు. మజ్ను, ఆఖరి పోరాటం, జానకీ రాముడు చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపును పొందాడు. అలా సాగుతున్న నాగ్ కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పింది మణిరత్నం గీతాంజలి(1989). ఆ దెబ్బకి లవర్ బాయ్ ఈమేజ్ నాగ్ సొంతం అయ్యింది. అది 15 ఏళ్ళపాటు అలా కొనసాగిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ ఆయన అమ్మాయిల మనసు దోచే సోగ్గాడే... అలా అని రొమాంటిక్ పాత్రలకే పరిమితం కాలేదు... భక్తి పారవశ్యంలో ముంచెత్తే వాగ్గేయకారుడయ్యాడు...(అన్నమయ్య), భక్తుడైపోయాడు (శ్రీరామదాసు), దేవుడయ్యాడు (షిర్డీసాయిబాబ),  అన్యాయాన్ని ఎదిరించే విప్లవకారుడు రాజన్నగా మారాడు. అటు క్లాసునూ, మాస్ నూ అన్ని వయసుల వారినీ మెప్పించే విభిన్న చిత్రల్లో నటించాడు అక్కినేని నాగార్జున.

కొన్ని పాత్రల్లో చేస్తే తమ ఇమేజ్ దెబ్బతింటుందేమో నని వెనుకడుగు వేయకుండా సంచలనం సృష్టించాడు. ఈ వయసులోనూ నాగ్ ప్రయోగాలు చేసి సక్సెస్ అందుకోవటమే కాదు, తన తనయులతోసహా యువ హీరోలకు సవాల్ విసురుతూనే ఉన్నాడు. గగనం, రాజన్న, సొగ్గాడే చిన్నినాయనా, ఊపిరి... ఇవన్నీ ఆ కోవలోనివే. హుందాగా ఉండే పాత్రలతో అందుకే అందరి అభిమానాన్ని చూరగొంటున్నాడు అక్కినేని నాగార్జున. నటుడిగా తండ్రి నాగేశ్వర్ రావు ఇంపాక్ట్ కొంత ఉన్నప్పటికీ తన ఒరిజినాలిటీని కాపాడుకుంటూ కెరీర్ లో పైకెదిగాడు.

నాగేశ్వర్ రావు ఫామిలీ చిత్రల్లో నటించి మహిళల అభిమానాన్ని బాగా సంపాదించారు. అలా అని అవే పాత్రల్లో ఇమిడిపోకుండా డిఫరెంట్ రోల్స్ ఎంపిక చేసుకున్నారు. చక్రధారి, చాణక్య (చాణిక్య చంద్రగుప్తుడు), భక్త తుకారం, మహాకవి క్షేత్రయ్య, కాళిదాసు వంటి వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించారు. అలాగే నాగార్జున కూడా అమ్మాయిల మనసుదోచే మన్మధుడి నుంచి అన్నమయ్య, భక్తరామదాసు, శ్రీ షిర్డీ సాయిబాబ పాత్రల్లోకి దిగిపోయి సక్సెస్ అందుకున్నాడు. నటుడిగా తన కెరీర్ ను ఎంత బిల్డప్ చేసుకున్నాడో... ఎంటర్ ప్రెన్యూర్ గా నూ అదే స్థాయిలో పైకెదిగాడు. ప్రతిభావంతులైన కొత్త వారిని ప్రోత్సహిస్తూ ఎంతో మందికి మంచి భవిష్యత్ అందిస్తున్నాడు.
   
నేడు(ఆగష్టు29న) అక్కినేని నాగార్జున 57వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకూ తన సినిమాల ఎంపికలో బిజీగా ఉన్న ఈ నటుడు ఇప్పుడు ఇద్దరు కుమారుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడున్న పోటీకి తగినట్టుగా వాళ్ళకు మంచి సలహాలిస్తూ... పెద్ద కుమారుడు నాగచైతన్యతో పాటు ఇప్పుడు అఖిల్ ను కూడా ముందుకు నడిపిస్తున్నారు.  ఇప్పటివరకూ ఎన్నో సక్సెస్ లు అందుకున్న నాగార్జున ఇక ముందు కూడా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆయనకు తెలుగు విశేష్ తరపున  జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Nagarjuna  birthday special  57th  

Other Articles

Today on Telugu Wishesh