చిరు సెట్లో జాయిన్ అయిన కాజల్ | kajal pic in Chiru 150 set goes viral

Kajal pic in chiru 150 sets viral

kajal Agarwal in Chiru sets, kajal Agarwal spotted pic in Chiru 150 set, kajal with Chiru, Chiru with Kajal, Kajal in Chiru 150 movie pic, Khaidi no 150 heroine, Khaidi no 150 actress, Khaidi no 150 shooting stills

kajal Agarwal spotted pic in Chiru 150 set goes viral.

150 సెట్లో చిరుతో ఉన్న హీరోయిన్ ఎవరు?

Posted: 08/25/2016 04:48 PM IST
Kajal pic in chiru 150 sets viral

ఖైదీ నంబర్ 150 అప్పుడే సగం షూటింగ్ అయిపోయింది. కామెడీ, ఫైట్లు, చిరు సోలో సీన్లు అన్ని దాదాపుగా అయిపోయాయి. ఇక మిగిలింది రొమాన్స్ అండ్ సాంగ్స్ పార్టే. అది ఎప్పుడు ఎవరితో మొదలుపెడతారో ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ, చిత్రంలో కాజలే హీరోయిన్ గా ఫైనల్ అయిపోందన్న ఓ వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది.

ఇంతలో ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలీదుగానీ, ఈ చిత్ర షూటింగ్ స్పాట్ లో కాజల్ అంటూ ఓ ఫోటో నెట్ లో హాల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న షెడ్యూల్ లో కాజల్ పాల్గొంటోందని ఆ ఫోటో సారాంశం. చిరు ఎదురుగా నిల్చుని ఉన్న ఓ హీరోయిన్ వెనుక నుంచి తీసిన ఫోటోను పెట్టి అది కాజలే అంటూ చెబుతున్నారు.

అయితే తన సినిమా షూటింగ్ ఫోటోలను సాధారణంగా షేర్ చేసుకునే కాజల్, చిరు షూటింగ్ లో పాల్గొంటే చెప్పుకోకుండా ఉంటుందా? అయితే అభిమానులు మాత్రం ఆమె ఫిజిక్ ను బట్టి అది కాజలేనని డిసైడ్ అయిపోతున్నారు. మరికొందరేమో అది షూటింగ్ ప్రారంభంలో కాజల్ కాజువల్ గా కలిసినప్పుడు తీసిన ఫోటో అని అంటున్నారు. ఏదేమైనా ఇప్పటి ఫోటో నిజమైతే మాత్రం ఒకే కుటుంబంలో మూడు జనరేషన్లు, నలుగురు హీరోలతో నటిస్తున్న ఏకైక హీరోయిన్ గా చందమామ చరిత్రలో నిలిచిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiru  Kajal  Shooting  Khaidi no 150  

Other Articles