వినోద్ హత్య ఉదంతంపై స్పందించిన దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ | tammareddy sensational comments on tollywood heroes

Tammareddy sensational comments on tollywood heroes

Tammareddy Bharadwaja response on Pawan fan Vinod murder, tammareddy sensational comments on tollywood heroes, top heroes should responsible for Fan Clash, Tamareddy on fans clash

Tammareddy Bharadwaja response on Pawan fan Vinod Royal murder. sensational comments on tollywood heroes.

టాలీవుడ్ అగ్ర హీరోలపై సంచలన వ్యాఖ్యలు

Posted: 08/25/2016 03:13 PM IST
Tammareddy sensational comments on tollywood heroes

ఓ స్టార్ హీరో సినిమా ఫట్ అంటే చాలూ మరో స్టార్ హీరోలు రోడ్డెక్కి సంబరాలు చేసుకోవటం, సోషల్ మీడియాలో పంచ్, కామెంట్లు టైంపాస్ చేయటంతో సరిపెట్టుకున్న అభిమానులు ఏకంగా చంపుకునేంత పరిస్థితి రావటం దారుణం. దీనికి వెనుక వెర్రితలలు వేసిన అభిమానం ఒక్కటే కాదు. ఆయా హీరోలు చేష్టలూడిగి చూడటం కూడా ఓ కారణం అవుతుంది. అభిమానులే దేవుళ్లు, మీరు లేకపోతే మేం లేం అని మైకుల్లో బిగ్గరగా చెప్పుకుని రెచ్చగొట్టి మరీ విజిల్స్ వేయించుకునే హీరోలు, ఫ్యాన్స్ తో ఇతరు హీరోలను, వారి అభిమానులను స్నేహపూర్వకంగా ఇంతవరకు ఎవరైనా చెప్పారా ? పోనీ అలాంటి ప్రయత్నం మచ్చుకైనా ఎవరైనా చేశారా? అంటే సమాధానం దొరకటం కష్టం. ఆ సంగతి పక్కనబెడితే పవన్ అభిమాని వినోద్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.  ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్లను పరిశీలిద్దాం.

తమ కాలంలో కూడా అభిమానులు - అభిమాన సంఘాలూ ఉండేవని, కానీ ఇలాంటి దారుణమైన ఘటనలు ఎప్పుడూ జరగలేదని అన్నారు. దాసరి నారాయణ రావు లాంటి వంటి పెద్దవాళ్లు చెబితే వినే పరిస్థితి ప్రస్తుత కాలంలో హీరోలు లేరని ఇప్పుడంతా "చెట్టు పేరు చెప్పుకొని తిరిగే హీరోలు ఎక్కువగా ఉన్నారని" తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట వరుసకు గొడవలు పడొద్దు అని అప్పుడప్పుడూ స్టేజీలపైకి ఎక్కి చెప్పినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ హీరోలంతా ముందుకువచ్చి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

అభిమానులు ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి హీరోల మధ్య కూడా ద్వేషాలు పెరగటానికి ఇప్పటి సినిమాల్లో వచ్చే పిచ్చి పిచ్చి డైలాగులు కూడా కారణమని భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. నేటి హీరోలంతా బాగా చదువుకున్నవాళ్లేనని అటువంటి పిచ్చి పిచ్చి డైలాగుల పర్యవసానాలు ఎలా ఉంటాయన్న విషయం వారంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. ఇటువంటి దారుణమైన పరిస్థితులపై తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని తమ్మారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తన అభిమాన హీరోలకు సంబందించి ఎవరు గొప్ప అనే విషయలపై డిస్కషన్స్ రావడం, అది ఏకంగా కత్తులతో దాడిచేసుకునే స్థాయికి చేరడం వంటి ధారుణమైన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రహీరోలు ఏదో ఒకటి చేయాలని ఆయన కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tammareddy Bharadwaja  Pawan fan  Vinod Royal  murder  

Other Articles