ఇప్పట్లో పెళ్లి లేదంటున్న విశాల్ ప్రేయసి | Varalaskhmi Sarathkumar denies marriage rumours

Varalaskhmi sarathkumar denies marriage rumours

Vishal Break up, Vishal Varalaskhmi Sarathkumar, Varalaskhmi Sarathkumar denies marriage rumours, Vishal Varalakshmi marriage rumours, Sharath Kumar Daughter, Sharath Kumar Son in law Vishal, Vishal uncle Sharath Kumar

Varalaskhmi Sarathkumar has taken to twitter where she has clearly stated that she has no intention of marrying in the near future as she is already married to her film career. She has requested the media not to write about her wedding anymore.

విశాల్ ప్రేయసి గట్టి పంచే ఇచ్చింది

Posted: 08/20/2016 05:33 PM IST
Varalaskhmi sarathkumar denies marriage rumours

కోలీవుడ్ విశాల్ వరలక్ష్మి శరత్‌ కుమార్ ప్రేమ వ్యవహారం మొత్తం సౌత్ అంతా పాకిన సంగతి తెలిసిందే. నడిగర్ సంఘం విజయంతో శరత్ కుమార్ పై పైచేయి సాధించిన విశాల్, కూతురు వరలక్ష్మిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు ఎప్పటి నుంచో షికారు చేస్తున్నాయి.

తాజాగా ఓ ప్రెస్ మీట్ లో విశాల్ మాట్లాడుతూ.... చిన్నతనం నుంచి ప్రేమలో ఉన్న అమ్మాయే తన భార్య కాబోతుందని చెబుతూ మరోసారి ఆ విషయాన్ని ధృవీకరించాడు. వచ్చే ఏడాది లక్ష్మీకరమైన అమ్మాయితో నా వివాహం ఉంటుంది, నడిగర్ సంఘం భవనంలోనే అది జరుగుతుందని, పైగా నడిగర్ కోశాధికారి అయిన నటుడు కార్తీ తేదీలు కూడా ఫిక్స్ చేశాడంటూ  ఓ స్టేట్ మెంట్ ఇచ్చి పడేశాడు. దీంతో వచ్చే సంక్రాంతికి వీరిద్దరు జంటగా మారబోతున్నారని అంతా ఫిక్సయ్యారు.

అయితే ఈ లోపే ఆ వ్యాఖ్యలపై వరలక్ష్మీ శరత్ కుమార్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించింది. తన ప్రేమ .. పెళ్లి గురించి వస్తున్నవన్నీ పుకార్లు, నా కెరీరే నా భర్త. ఇప్పటికే అనవసరమైన ప్రచారం చాలా ఎక్కువగా చేశారనీ .. ఇక రాద్ధాంతాలు చేయడం మానుకోవాలంటూ మీడియాకు ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇందులో మీడియా తప్పేముందమ్మ తల్లీ. నీ ప్రియుడు విశాల్ చెబితేనే కదా వారు రాసేది అంటూ సెటైర్లు పడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varalaskhmi Sarathkumar  fire  Vishal  marriage  statement  

Other Articles