వచ్చే ఏడాది రవితేజ రెండు చిత్రాలు | raviteja back to back with two films

Raviteja back to back with two films

raviteja back to back two films, Raviteja with Bobby Again, Ravi teja Vikram-Deepak film, Raviteja with two directors for one film

raviteja back to back with two films, Under Bobby direction and Vikram-Deepak film.

మాస్ రాజా ఇదేం ట్విస్టయ్యా

Posted: 08/18/2016 04:36 PM IST
Raviteja back to back with two films

మాస్ రాజా ఫ్యాన్స్ కి ఈ యేడాది నిరాశే ఎదురయ్యేలా ఉంది. ఒప్పుకున్న ప్రాజెక్టును ఇంతవరకు మొదలుపెట్టకపోవటం, పోనీ ఈ గ్యాప్ లో అయినా కొత్త కథలేవీ వినకుండా కేవలం ఖాళీగానే కాలక్షేపం చేస్తున్నాడు. రెమ్యునరేష్ కారణంగానే దిల్ రాజు చిత్రాన్ని మిస్సయినప్పటికీ రాబిన్ హుడ్ మొదలుపెడతాడనుకున్నప్పటికీ అదీ జరగలేదు.

బెంగాల్ టైగర్ తో ఊపు మీద ఉన్న రవితేజ ఇలా ఎందుకు చేస్తున్నాడంటూ అభిమానులు సైతం తిట్టుకునే స్థాయికి దిగజారాడు. దాంతో వచ్చే ఏడాది బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలతో ట్రీట్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఆల్రెడీ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న ఆయన, విక్రమ్ - దీపక్ అనే జంట దర్శకులు వినిపించిన కథకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఓ కొరియన్ సినిమాకి అది రీమేక్ అని సమాచారం.

ఇలా ఈ రెండు సినిమాల ఒకేసారి సెట్స్ పైకి వెళ్లేలా చూసుకోవటంతోపాటు, ఆ రెండు షూటింగ్ లు ఏకకాలంలో జరిగేలా ఫ్లాన్ చేసుకుంటున్నాడంట. రెండు నెలల గ్యాప్ లోనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చూడాలని ఇప్పటికే చిత్ర నిర్మాతలకు సూచించాడని తెలుస్తోంది. కానీ, కొత్త చిత్రాలు ఎప్పుడు మొదలు పెడతాడన్నది మాత్రం ఇంకా చెప్పలేదు మరి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Raviteja  2017  two  movies  back to back  

Other Articles