కార్తీ కాష్మోరా ఫస్ట్ లుక్ విడుదల | Karthi Kashmora Movie First Look Poster Revealed

Karthi kashmora movie first look poster revealed

Karthi Kashmora Movie First Look, Karthi as Kattappa, Karthi as Kalakeya, Karthi Tyrant Avatar, arthi new Avatar for Kashmora, Karthi with Nayanatara, Karthi with Sri Divya

Karthi Kashmora Movie First Look Poster Revealed, Karthi look in Tyrant Avatar.

కట్టప్ప+కాళకేయ=కాష్మోరా

Posted: 08/18/2016 12:51 PM IST
Karthi kashmora movie first look poster revealed

నిత్యం ఒకే టైప్ సినిమాలు, ఫైట్లు, కథలు, పాటలు చూసి చూసి ఉన్న ప్రేక్షకుడికి తమ విభిన్న కథలతో, గెటప్ లతో వెరైటీ ప్రయోగాలు చేస్తూ ఆకట్టుకోవటంలో బ్రదర్స్ సూర్య-కార్తీలు ఎప్పుడు ముందుంటారు. ఈ విషయంలో అన్న కంటే కార్తీ కాస్త వెనుకంజలోనే ఉన్నప్పటికీ చేసిన కొద్దీ సినిమాలు మాత్రం అతడిలోని నటన ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ఊపిరితో తెలుగు ఆరంగ్రేటంలో హిట్ కొట్టినప్పటికీ గత కొంత కాలంగా కోలీవుడ్ లో కార్తీకి హిట్ లేదనే చెప్పాలి. కానీ, కాష్మోరా ఆ లోటు తీరస్తుందంటున్నాడు కార్తీ.

karthik in kalakeyya

గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హర్రర్ మూవీ ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఇందులో యుద్దవీరుడి గెటప్ లో చేతిలో చివర గ్రద్ద ఆకారంతో ఉన్న పోల్ లాంటి ఆయుదం దరించిన కార్తీ... యుద్దంలో శత్రువులందరినీ చంపిన తర్వాత వికట్టహాసం చేసే యుద్దవీరుడిలా నవ్వుతూ కనిపిస్తున్నాడు. లుక్ పరంగా కటప్పలా గుండు విత్ గడ్డం, డ్రెస్సింగ్ పరంగా కాళకేయలా ఉన్న రూపం బహుశా బాహుబలి నుంచే దర్శకుడు ఈ లుక్ కోసం ప్రేరణ పొంది ఉన్నాడేమో.

ఇందులో కార్తీ మొత్తం 47 రకాల గెటప్ లలో కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది. హర్రర్ తోపాటు కామెడీ, యాక్షన్ కాస్త పిరియాడిక్ ప్లేవర్ ను కలుగలుపుకుంటున్న కాష్మోరాను దీపావళికి రిలీజ్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు. నయనతార, తెలుగు అమ్మాయి శ్రీదివ్యలు కార్తీ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karthi  Kashmora  First Look  Tyrant Avatar  Nayanatara  Sri Divya  

Other Articles