చంద్రశేఖర్ యేలేటితో అక్కినేని నాగార్జున సినిమా | Nagarjuna movie with Chandrasekhar Yeleti

Nagarjuna movie with chandrasekhar yeleti

Nagarjuna movie with Chandrasekhar Yeleti, Nag under Yeleti direction, Nag with Manamantha Director

Nagarjuna movie with Chandrasekhar Yeleti.

కమర్షియల్ వద్దంటూ నాగ్ ఏం చేయబోతున్నాడు

Posted: 08/16/2016 06:47 PM IST
Nagarjuna movie with chandrasekhar yeleti

గత ఏడాదిన్నరగా విభిన్నమైన చిత్రాలను అందిస్తూ వరుసగా హిట్ల హిట్లు కొడుతూ అగ్రహీరో నాగార్జున కుర్రహీరోలకు సవాల్ విసురుతున్నాడు. మనం తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సోగ్గాడే చిన్నినాయనా, ఆ వెంటనే ఊపిరి అంటూ రెండు 50 కోట్ల మార్కు చిత్రాలను అందజేశాడు. ఈ క్రమంలో ఇప్పటి నుంచి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోవొద్దని నాగ్ డిసైడ్ అయ్యాడంట.

ప్రస్తుతం భక్తిరసంపై దృష్టిపెట్టిన నాగ్ రాఘవేంద్రరావు డైరక్షన్లో ఓం నమో వెంకటేశాయ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక లైన్లో కళ్యాణ కృష్ణతో బంగ్రారాజు అనే మరో ప్రాజెక్టు కోసం రెడీ గా ఉన్నాడు. ఇంతలో మరో క్రేజీ ప్రాజెక్టును ఓకే చేసినట్లు చెప్పుకుంటున్నారు. విలక్షణమైన సినిమాలను అందించే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో జత కట్టనున్నట్లు చెబుతున్నారు. మనమంతా చిత్రంతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న యేలేటి తాజాగా నాగ్ కి ఓ కథ వినిపించడం, దానిపై నాగ్ కూడా ఆసక్తికనబరుస్తున్నాడని తెలుస్తోంది.

రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం నమో వేంకటేశాయా షూటింగ్ కర్ణాటక ప్రాంతంలోని 'చిక్ మగుళూరు'లో జరుగుతోంది. అక్కడి నుంచి తిరిగొచ్చాక యేలేటి ప్రాజెక్టును నాగ్ అనౌన్స్ చేస్తాడని సమాచారం. పెద్ద హీరోలు తన దర్శకత్వంలో పని చేసేందుకు ముందుకు రావటం లేదని స్వయంగా  యేలేటి చెప్పిన తరుణంలో నేనున్నాను అంటూ నాగ్ రావటం నిజంగా అభినందనీయమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Manamantha  directior  Chandra Sekhar Yeleti  

Other Articles