పవన్ డాలీ చిత్రం షూటింగ్ అప్ డేట్స్ | pawan dolly movie first schedule come to end

Pawan dolly movie first schedule come to end

pawan dolly movie, pawan dolly movie first schedule, pawan in dolly movie sets, pawan shruthi hassan in sets, Pawan in Kadapa king sets

pawan dolly movie first schedule come to end.

పవన్ జస్ట్ టూ డేస్...

Posted: 08/16/2016 12:36 PM IST
Pawan dolly movie first schedule come to end

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అల్రెడీ పట్టాలెక్కిన విషయం తెలిసిందే. గోపాల గోపాల చిత్ర దర్శకుడు డాలీతో పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ గా చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే షూటింగ్ ప్రారంభమై వారం గడుస్తున్నా ఇంతవరకు పవన్ జాడ లేకపోవటంతో మళ్లీ పాత సీనే రిపీట్ అవుతుందా అన్న పుకార్లు వినిపిస్తన్నాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానులకు ఓ వార్త రిలీజ్ చేసింది పవన్ ఆఫీస్.

ప్రస్తుతం పవన్ లేని సన్నివేశాలను మాత్రమే చిత్రీకరణ జరుపుతున్నారంట. మరో రెండు రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావటంతోపాటు రెండో షెడ్యూల్ ను వెనువెంటనే ప్రారంభించి అందులో పవన్ జాయిన్ అవతాడని చిత్ర యూనిట్ సమాచారం అందించింది. ఇప్పటికే ఈ చిత్రం సెట్స్ కి వెళ్లడానికి చాలా సమయం పట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పవన్ కోరమీస కట్టుతో సరికొత్త లుక్ లో కనిపించేందుకు అల్రెడీ ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే.

దర్శకుడి మార్పు, స్క్రిప్ట్ చేంజ్ కావటం, తదితర ఆటంకులను దాటి ఎట్టకేలకు డాలీ దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభించుకుంది. పవన్ సన్నిహితుడు శరత్ మరార్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణాన్ని ఐదు నెలల్లో పూర్తిచేసేలా ప్రస్తుతం ప్లాన్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Dolly  First Schedule  Kadapa King movie  

Other Articles