నాని మజ్ను టీజర్ విడుదల | Nani Majnu teaser released

Nani majnu teaser released

Nani Majnu teaser, Nani first look teaser, Nani Majnu heroine, Nani actress minus

Nani Majnu teaser released.

మజ్ను టీజర్ : ప్రేమ ఫేలయితే కొత్త వేదాంతం

Posted: 08/12/2016 03:42 PM IST
Nani majnu teaser released

ఒక సినిమా వచ్చి ఇలా హిటవుతుందో లేదో అలా కొత్త సినిమాను ఓకే చేసి మొదలెట్టేయటం, అది సెట్ మీద ఉండగానే, ఇంకో సినిమాను రిలీజ్ చేయటం, ఆ సినిమా కూడా షూటింగ్ లో ఉండగానే ఇంతకు ముందు చెప్పుకున్న సినిమా వచ్చేయటం కాస్త కన్ఫ్యూజ్ గా ఉంది కదా. ప్రస్తుతం నాని చేస్తున్న పని ఇదే. ఏ క్షణాన హిట్టు కొట్టడం ప్రారంభించాడోగానీ, ఒకదాని వెంట మరోకటి వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.   

ప్రస్తుతం నేను లోకల్ షూటింగ్ మొన్నే ప్రారంభించగా, మజ్ను ముగింపు దశకు చేరకుంది. ఆ మధ్యే మజ్ను ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, ఈరోజు టీజర్ రిలీజ్ చేసేశారు. ఇక టీజర్ లో నాని ఎప్పటిలాగే ఎక్స్ ప్రెషన్ తో కుమ్మేశాడు. ఇళయరాజా సాడ్ సాంగ్స్ తీసుకుని, ట్రెయిన్ లో కూర్చుని అభినందన సినిమాలోని ప్రేమ లేదని ప్రేమించరాదని... అంటూ పాట ప్లే అవుతుంటే, ఇటు మరో యాంగిల్ లో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ ను చూపిస్తూ, ఇంకోవైపు మనోడు బాధగా మెడలో కండువా వేసుకుంటూ... చివర్లో గుర్రపు రథంపై నాని దూసుకెళ్తుంటే స్టార్ట్ లవింగ్ అని తెరపై పడుతుంది.

ప్రేమలో ఫెలయితే ఇంకా ఎక్కువ ప్రేమించాలని బహుశా నాని ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకుంటున్నాడేమో! ఆ సంగతి పక్కనబెడితే హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ గురించే నిద్రమొహం లా ఉందని నెటిజన్లు సెటైర్లు పేలుస్తారు. మరి యాక్టింగ్ లో ఏం చేస్తుందో చూడాలి.  ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా, చిత్రం సెప్టెంబర్ 17న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Emma Immanuel  Majnu  Virinchi Varma  

Other Articles