రజనీకాంత్ బయోపిక్ తీస్తారంట | Rajinikanth's family to make a biopic on him

Rajinikanth s family to make a biopic on him

Superstar Rajinikanth's family, rajanikanth biopic, Movie on rajanikanth, Dhanush play in Rajani role, Dhanush in rajaniknath Bio pic

Superstar Rajinikanth's family to make a biopic on him. Dhanush play in Rajani role.

బయోపిక్ తో సంచలనానికి రెడీ

Posted: 08/10/2016 06:59 PM IST
Rajinikanth s family to make a biopic on him


సూపర్ స్టార్ రజనీకాంత్, ఈ పేరుకున్న క్రేజ్ ఏంటో మొన్న కబాలి రిలీజ్ టైంలో ప్రపంచమంతా కళ్లప్పగించి చూసింది. ఈ లేటు వయసులో కూడా అనుకరించడానికి సాధ్యం కానీ స్టైల్, అసమానమైన నటన తలైవాకే సొంతం. ఒక సాధారణమైన వ్యక్తి .. అసాధారణమైన శక్తిగా మారడం రజనీకాంత్ విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. నటుడిగానే

కాదు, వ్యక్తిత్వం విషయంలోను ఆయన ఎవరెస్టు శిఖరమే. ఆయన జీవితంలో అభిమానులకి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఎన్నో వున్నాయి. అందుకే ఆయన కథను సినిమాగా తీసేందుకు ప్రయత్నం జరగబోతుంది. బస్ కండక్టర్ టూ సూపర్ స్టార్ గా సాగిన ఆయన జర్నీని కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య లు స్వయంగా తెరకెక్కించబోతున్నారంట. నటుడు, అల్లుడు అయిన ధనుష్ తోనే ఈ సినిమాను తీసే ఆలోచనలో వారు ఉన్నారు.

ఈ సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండగా, సౌందర్య నిర్మాతగా వ్యవహరించబోతుందని సమాచారం. అయితే ఈ వార్తపై స్పందించేందుకు వారు అందుబాటులో లేరు. ఒకవేళ ఈ వార్త గనక నిజమైతే మాత్రం మరో ప్రభంజనానికి తెరలేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Superstar  Rajanikanth  biopic  Dhanush  

Other Articles