బాహుబలి 2 కోసం మాహిష్మతి లాంటి భారీ సెట్ | New Kingdom for Baahubali part 2

Sabu cyril design new kingdom set for baahubali 2

new set for baahubali 2, Sabu Cyril new kingsom set, new kingsom for prabhas and rana, New Kingdom for Baahubali part 2

Sabu Cyril design new kingdom set for baahubali 2. Over 500 People Are Working To Create That Kingdom.

బాహుబలి కోసం కొత్త రాజ్యం

Posted: 08/03/2016 01:22 PM IST
Sabu cyril design new kingdom set for baahubali 2

సంచలనాలకు మారు పేరైన బాహుబలి తన రెండో భాగాన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకోంటోంది. మొదటి భాగాన్ని మించేలా రెండో పార్ట్ లో ఎమోషన్ పాళ్లను, యుద్ధ సన్నివేశాలతో నింపబోతున్నాడు జక్కన్న. ఫస్ట్ పార్ట్ లో మేజర్ హైలెట్స్ గా నిలిచిన సెట్టింగ్స్ విషయంలో అస్సలు తగ్గట్లేదంట. ముఖ్యంగా మాహిష్మతి రాజ్యానికి సంబంధించి ఓ నిజమైన రాజ్యాన్నే చూస్తున్నామన్న అనుభూతిని కలిగించడంలో సక్సెస్ అయిన రాజమౌళి కొనసాగింపులో కొత్త రాజ్యాన్ని చూపబోతున్నాడంట.

మాహిష్మతి రాజ్యాన్ని మరింత విస్తరిస్తూ సెట్ లు వేయాల్సిందిగా నిర్మాతలను కోరిన రాజమౌళి, ఆ పనిని ఆర్ట్ డైరక్టర్ సాబూ సిరిల్ కు అప్పజెప్పాడంట. ప్రస్తుతం 500 కార్మికులు ఈ సెట్ కోసం పని చేస్తున్నారంట. విజువల్ పరంగా మాహిష్మతిని డామినేట్ చేసే విధంగా, కొత్తగా కనిపించాలని సిరిల్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు చెబుతున్నారు.

ఇక ప్రస్తుతం రెండవ భాగానికి సంబంధించిన యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రభాస్, రానా ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. నవంబర్ కల్లా బాహుబలి మేజర్ టాకీ పార్ట్ ను పూర్తి చేసి ఆపై కాస్త గ్యాప్ ఇచ్చి విజువల్ వర్క్ పై దృష్టిసారించాలని రాజమౌళి ఆలోచన. మొదటి దానికంటే మరింత భారీతనాన్ని సంతరించుకోబోతున్న 'బాహుబలి 2', ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  rajamouli  baahubali part 2  Sabu Cyril  new kingdom  

Other Articles