akkineni akhil doing second film with director koratala siva

Akkineni akhil doing second film with director koratala siva

akkineni nagarjuna, akkineni akhil, akhil akkineni, akhil doing second film, akhil second film, akhil next movies, akhil movies list, akhil movie entry

akkineni ahil doing second film with director koratala siva. now he is liestining suitable stories for his body language

సెంటిమెంట్ కలిసొస్తుందా...?

Posted: 07/12/2016 12:50 PM IST
Akkineni akhil doing second film with director koratala siva

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన అఖిల్ సినిమా విడుదలై దాదాపు 10నెలలు అవుతోంది. ఇంకా అఖిల్ తన రెండో సినిమా గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే, ఈ సినిమాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలనే చూస్తున్నాడట అఖిల్ అందుకే డైరెక్టర్ సెలక్షన్ లో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. కథల ఎంపికలో కూడ సీనియర్ సలహాలను తీసుకుంటున్నాడు. సెంటిమెంట్ గా చూసుకుంటే యంగ్ హీరోలందరూ గతంలో రెండో సినిమానే బ్లాక్ బస్టర్ కొట్టారని, ఇప్పుడు అదే రూట్ లో అఖిల్ కూడ వెళ్లాలని అనుకుంటున్నాడట.

జూనియర్ ఎన్టీఆర్ కూడ మొదటి సినిమా ఫ్లాప్ అయ్యిన తర్వాత రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ తో హిట్ కొట్టాడు. అలాగే నాగచైతన్య కూడ మొదటి సినిమా జోష్ నిరాశపరిస్తే, రెండో సినిమా ఏమాయ చేసావే చైతూని ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఇక అల్లు అర్జున్ కూడ గంగోత్రి సినిమా కంటే తన రెండో సినిమా ఆర్య తోనే సూపర్ హిట్ ని అందుకుని స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. రామ్ చరణ్ కూడ మొదటి సినిమా చిరుత కంటే రెండో సినిమా కూడ మగధీరతోనే మెగా పవర్ స్టార్ అనిపించుకున్నాడు. అంతేకాదు, అఖిల్ క్లోజ్ ఫ్రెండ్ అయిన సాయి థరమ్ తేజ్ కూడ తన రెండో సినిమా పిల్లా నువ్వు లేని జీవితం అంటూనే హిట్ కొట్టాడు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ని ఫాలో అయిపోవాలని అఖిల్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇలా టాలీవుడ్ వారసులు అందరూ కూడ తమ రెండో సినిమాతోనే ఇండస్ట్రీలో తమకంటూ ఒక క్రేజ్ ని సంపాదించుకున్నారు. అదే రూట్ లో అఖిల్ కూడ తన రెండో సినిమాని డైరెక్టర్ కొరటాల శివ తో చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. దీనికోసం అక్కినేని నాగార్జున స్వయంగా కొరటాల శివని అఖిల్ కోసం కథ రెడీ చేయమన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా చిన్నబ్బాయి హిట్ కొట్టాలని గట్టిగా ఆశిస్తున్నాడు నాగార్జున.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akhil next movie  akhil and koratala siva  nag son akhil  akhil akkineni  

Other Articles