పవన్ కి ఇరకాటంలో పెట్టిన అభిమాని | Pawan about multi starrer with Ajith

Pawan london fan asked about multi starrer with ajith

Pawan kalyan London fans, Pawan about Ajith, Pawan about multi starrer, Power star about Thala, pawan kalyan at ukta 6th anniversary

Pawan kalyan interact with London Fans in Facebook. One of the fan asked about multi starrer with Thala Ajith Kumar.

పవన్ ను ఇబ్బంది పెట్టిన లండన్ అభిమాని

Posted: 07/11/2016 10:25 AM IST
Pawan london fan asked about multi starrer with ajith

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... తలా అజిత్ కుమార్ ఇద్దరికీ చాలా పోలికలు ఉన్నాయి. అశేషమైన అభిమానుల అండే కాదు సోషల్ సర్వీస్ లోనూ ఇద్దరూ ఒకేస్థాయిలో ఉన్నారు. అందుకే వీళ్లద్దరిని పోలుస్తూ పోస్ట్ లు చేసుకుంటూ వీరి అభిమానులు సోషల్ మీడియాల్లో సందడి చేస్తుంటారు. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది.

యూకేటీఏ 6వ ఉత్సవాలలో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన పవన్ అక్కడి ఎన్నారైలతో ముఖాముఖి అవుతున్నాడు. గతరాత్రి డిన్నర్ వారితో ముగిసిన అనంతరం ఫేస్ బుక్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానమించ్చాడు.   ఈ సందర్భంగా ఓ అభిమాని అజిత్ తో మల్టీస్టారర్ ఎప్పుడు చేయబోతున్నారు అని అడిగాడు. ‘‘ఇంత వరకు ఈ విషయమై ఎవరూ సంప్రదించలేదని, సరైన కథతో వస్తే ఖచ్ఛితంగా చేస్తానని’’ పవన్ రిప్లై ఇచ్చాడు. పవన్ స్వతహాగా మల్టీ స్టారర్ చిత్రాలకు దూరం. ఏదో అభిమాని అడిగాడని తప్పించి, నిజంగా చేస్తాడా ఏంటి?

అజిత్ తో బిల్లా, ఆట ఆరంభం లాంటి బ్లాక్ బస్టర్ లు అందించాడు డైరక్టర్ విష్ణువర్థన్. ఆపై పవన్ తో పంజా అనే సినిమా తీశాడు. నిజానికి పవన్ తో పంజా చేయాల్సిందిగా విష్ణుకి సూచించింది అజితేనట. కానీ, ఆ చిత్రం ఎందుకనో ఆడలేదు. అప్పట్లో అజిత్ వేదాళం రీమేక్ లో నటిస్తాడనే వదంతులు వచ్చినప్పటికీ అదంతా ఉత్తదేనని తర్వాత తెలిసిందే. మల్టీస్టారర్ లపై ఆసక్తిలేని పవన్ అభిమానికి ఏదో మొక్కుబడిగా సమాధానామిచ్చాడన్నది స్పష్టమౌతుంది.  అన్నట్లు లండన్ నుంచి రాగానే డాలీ సినిమా పట్టాలెక్కబోతుందట. ప్రస్తుతం కోరమీసం కట్టుతో కనిపిస్తున్న పవర్ స్టార్ సినిమా కోసం అదే లుక్కును మెయింటెన్ చేయబోతున్నాడా? చూద్దాం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  ukta 6th anniversary  London  Thala Ajith Kumar  

Other Articles