దర్శకులను మాయ చేస్తున్న తెలుగు అమ్మాయి | Designer Shree Rapaka becomes busy actress now

Designer shree rapaka becomes busy actress now

Designer Shree Rapaka, Actress Shree Rapaka, Shree Rapaka hot, Shree Rapaka kollywood chances, Shree Rapaka new telugu girl, Arjun Reddy Movie Actress

Designer Shree Rapaka becomes busy actress now. Got Chances in Kollywood and as well as telugu movies.

దర్శకులను మాయ చేస్తున్న తెలుగు అమ్మాయి

Posted: 07/09/2016 03:47 PM IST
Designer shree rapaka becomes busy actress now

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తాయో చెప్పలేం. సినిమాల్లో రాణించాలని కలలతో వచ్చేవారికి ముందు అవమానాలు, ఆపై చిన్న చిన్న అవకాశాలు, ఎలాగోలా తమ టాలెంటును చూపించి నెట్టుకొస్తుంటారు. ఇంకా కొందరైతే ఒక్క ఛాన్స్ కోసం ఎంత దూరమైన వెళ్లేందుకు తెగిస్తారు. కానీ, అలాంటి కష్టాలేం పడకుండానే ఇప్పుడో తెలుగమ్మాయి ఇండస్ట్రీని ఏలేందుకు సిద్ధమైపోయింది.

Shree Rapaka Telugu Actress

శ్రీ రాపక  తెలుగు సినీ ఇండస్ట్రీ ఈ పేరు కొత్తేం కాదు. అల్లు అర్జున్, జగపతి బాబు వంటి స్టార్ హీరోలకే కాదు, ఆది లాంటి చిన్న హీరోలకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. పాతికేళ్లు కూడా లేని ఈ హైదరాబాదీ అమ్మాయి తొలుత హీరోయిన్ కావాలనే వచ్చింది. అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవటంతో ఇలా డిజైనర్ అవకాశం ఎత్తింది. బేసిక్ గా పొడగరి, పైగా అందగత్తె కావటంతో  దర్శకులు, నిర్మాతల కన్ను ఆమెపై పడి ఇప్పుడు వెంటపడుతున్నారు.

telugu girl shree rapaka
Shree Rapaka Busy with movies

Shree Rapaka Photo Shoot
అయితే హీరోయిన్ అవకాశం కోసం ఆమె ఎవరి వెంట పడింది లేదు. కేవలం ఫోటో షూట్ లతోనే ఆమె అవకాశాలకు చేజిక్కిచ్చుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో వైభవ్, విజయ్ సేతుపతి లాంటి హీరోల పక్కన నటించే అవకాశం కొట్టేసింది ఈ తెలుగు బ్యూటీ. అలాగని టాలీవుడ్ లో సినిమాలు చేయట్లేదా అనుకోకండి. విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి అనే చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఓపిక గా ఉంటే విజయాన్ని సాధించవచ్చు అన్న శ్రీ రాపక ఫిలాసఫీయే ప్రస్తుతం తనకు అవకాశాలు తెచ్చిపెడుతున్నాయని ఉబ్బితబ్బిబి అయిపోతుంది.  

Designer Shree Rapaka Turns busy actress now

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Designer  Shree Rapaka  Actress  Kollywood  Vijay Devarakonda  Arjun Reddy  

Other Articles