హమ్మయ్యా.... చిన్నారి పెళ్లికూతురికి శుభం కార్డు | Balika Vadhu serial to air its last episode on July 31

Balika vadhu serial to air its last episode on july 31

Balika Vadhu last Episode, Balika Vadhu reached Climax, Balika Vadhu serial the end, Balika Vadhu end

Balika Vadhu serial to air its last episode on July 31

ప్రేక్షకుల సహనానికి శుభం కార్డు

Posted: 07/06/2016 05:23 PM IST
Balika vadhu serial to air its last episode on july 31

సంవత్సరాల తరబడి టీవీ సీరియళ్లు సాగుతాయన్న సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది హిందీ టీవీ సీరియళ్లే. ఆ పై ఆ సంస్కృతి మనకు కూడా పాకింది. ఒక్కో సన్నివేశం ఒక్కో రోజు తీసి ప్రేక్షకుల సహనాన్ని పరిక్షించే సీరియళ్లు ఇంకా కొనసాగుతున్నయాన్నది అందరికీ తెలిసిందే. తాజాగా ఏళ్ల తరబడి సా... గుతున్న ఓ సీరియల్ కి ముగింపు పడబోతుందని సమాచారం.

తెలుగు డబ్బింగ్ సీరియళ్లు తెగ చూసేవారికి చిన్నారి కూతురు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాని మాతృక బాలికా వధు కలర్స్ ఛానెల్ లో 2008 లో ప్రారంభమైంది. ఇప్పుడు దీని గురించి ఓ గు-బ్యా డ్ న్యూస్.. ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ సీరియల్ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుందట. బాల్యవివాహం నేపథ్యంలో మొదలైన ఈ సీరియల్ చివరి ఎపిసోడ్ 2016 జూలై 31న ముగియనుందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ప్రధాన తారాగణం కూడా స్పందించకపోవటం విశేషం.

ఇక ఈ సీరియల్ లో టైటిల్ రోల్ ఆనంది పాత్రతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన అవికాగోర్ తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ, ఇప్పుడు ఏకంగా పెళ్లికి రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక మరో నటి ప్రత్యూష బెనర్జీ ప్రేమ, ఆత్మహత్య తెలిసిందే. అయినా అవేం పట్టనట్లు ఈ సీరియల్ మాత్రం నిరాఘాటంగా సాగుతూనే ఉంది. ఉత్తరాదితోపాటు సౌత్ లోనూ ప్రేక్షకాదరణ కలిగిన ధారావాహికగా గుర్తింపు పొందిన ఈ సీరియల్‌ కు ముగింపు పలకాలని యూనిట్ భావించిందట. దీంతో ఈ 'చిన్నారి పెళ్లి కూతురు' కష్టాలు జూలై 31తో తీరిపోనున్నాయి. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balika Vadhu  Last Episode  prathysha benarjee  Avika Gore  

Other Articles