babu bangaram audio on july 9th said maruthi via twitter

Babu bangaram audio on july 9th said maruthi via twitter

maruthi director, maruthi twitter, vekatesh movie news, vekatesh babu bangaram, babu bangaram movie, nayana tara and venky, venky movie

venkatesh and nayantara cobination movie babu bangaram directed by maruthi. he said that movie is finished except one song. and aduio coming very shortly

'బాబు' ఆడియోకి సర్వం సిద్ధం..!

Posted: 06/29/2016 01:16 PM IST
Babu bangaram audio on july 9th said maruthi via twitter

టాలీవుడ్ ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం బాబు బంగారం. ఈ సినిమా ఆడియోని జులై 9వ తేదిన గ్రాండ్ గా విడదల చేయనున్నట్లుగా ఈ సినిమా డైరెక్టర్ మారుతి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. సినిమా చాలా బాగా వచ్చిందని, ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసామని, అతి త్వరలోనే ఆడియో వేదికపై కలుద్దామని చెప్పాడు.

తనతో పాటు పనిచేసిన టీమ్ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై వస్తున్న ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా బిజినెస్ పరంగా కూడ మంచి ఊపుమీదుంది. ఈసినిమాని జులై 29వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాలో వెంకటేష్ సరసన నయనతార ముచ్చటగా మూడోసారి జతకట్టనుంది.

ఈ సినిమాలో వెంకటేష్ మునుపటికంటే ఎంతో యంగ్ గా కనిపించారని, సినిమా చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు చిత్రయూనిట్ వర్గాలు.

- మూర్తి  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles