సమంత మీద పడి గాలి తీసేశారు | fans mobbed and punctured samantha's vehicle in chennai

Fans mobbed and punctured samantha s vehicle in chennai

samantha at v care event, samantha mobbed by fans, fans misbehave with samantha, samantha bad experience with fans, సమంతను నలిపేశారు, సమంత ఫ్యాన్స్ ఇబ్బందులు, సమంత గాలి తీసేశారు, వీకేర్ ఈవెంట్ లో సమంతకు చుక్కలు చూపారు, సమంతకు చుక్కలు, సమంత కారు పంక్చర్, actress samantha news, telugu news, latest news

Fans mobbed and punctured samantha's vehicle in chennai at V care event.

సమంత మీద పడి గాలి తీసేశారు

Posted: 06/27/2016 12:31 PM IST
Fans mobbed and punctured samantha s vehicle in chennai

సౌత్ బేబీ డాల్ సమంతకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అసలు చెప్పటం ఎందుకు. మొన్నటిదాకా కేవలం తెలుగు అభిమానుల వరకే సొంతం అయిన ఈ నటి క్రేజ్, ఆపై టాప్ హీరోలతో చేయటంతో కోలీవుడ్ కు పాకిపోయింది. అయితే ఆ క్రేజే ఇప్పుడు ఆమెకు భయంకర అనుభవాలను పంచుతోంది. ఎక్కడికెళ్లినా అభిమానులే ఆమెకు చుక్కలు చూపుతున్నారు.
 
మదురై అభిమానుల అత్యుత్సాహంతో ఈ సౌత్ బ్యూటీకి ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. ఆదివారం ప్రముఖ సంస్థ 'వీకేర్'  తమ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవానికి సమంతను పిలిపించింది. అయితే ఆమె రాక గురించి ముందే పెద్దఎత్తున ప్రచారం చేయటంతో భారీ సంఖ్యలో జనాలు ఎగబడ్డారు. సమంత రాగానే ఆమెను చుట్టుముట్టారు. తొలుత, ఆమెను ఎలాగోలా షోరూములోకి తీసుకువెళ్లగలిగిన సిబ్బంది, తిరిగి బయటున్న కారులోకి ఎక్కించలేకపోయారు.

తమ అభిమాన తారను చూడనివ్వటం లేదన్న కోపంతో ఫ్యాన్స్ ఏకంగా ఆమె కారుకే పంచర్లు చేశారు. ఖంగుతిన్న నిర్వాహకులు అతికష్టం మీద తిరిగి ఆమెను షోరూమ్ లోకి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారొచ్చి లాఠీ చార్జ్ చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఈ పరిణామాలతో షాక్ తిన్న సమంత, ఈ చేదు అనుభవమంతా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles