hero srikanth son roshan movie niramala convent coming soon

Hero srikanth son roshan movie niramala convent coming soon

akkineni nagarjuna, nag nirmala convent, roshan nirmala convent, srikanth son, srikanth son intro, nirmala convent heroine, shriya , shiya sharma, nirmala convent director

hero srikanth son roshan movie niramala convent shooting finished in different locations. nagarjuna produce this movie and he acted small lead role in this movie.

కాన్వెంట్ లో లవ్ కి రెడీ...!

Posted: 06/27/2016 12:20 PM IST
Hero srikanth son roshan movie niramala convent coming soon

టాలీవుడ్ కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్ కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'నిర్మల కాన్వెంట్‌'. ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు.

జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన స్పెషల్‌ క్యారెక్టర్‌ సినిమాకి పెద్ద హైలైట్‌ అవుతుందని చెప్తున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. జైపూర్‌, అరకు, నైనిటాల్‌, చిక్‌మంగుళూరు వంటి డిఫరెంట్‌ లోకేషన్స్ లో ఈ చిత్రాన్ని చాలా రిచ్ గా చిత్రీకరించారు. త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాకి బిజినెస్ ఊపందుకుంది.

శ్రీకాంత్ తనయుడి మార్కెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని మరీ బిజినెస్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం గా అందరికీ గుర్తుండిపోతుందని చెప్తున్నారు దర్శకుడు కోటి. ఇక సినిమా ఆడియో లాంఛ్ ని కూడ త్వరలో చేయనున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles