suriya and amala paul combination movie memu releasing soon

Suriya and amala paul combination movie memu releasing soon

suriya, hero suriya, suriya next movie, suriya and amalapaul, heroine amala paul, director pandiraj, pandiraj pasanga 2, pasanga tamil

hero suriya heroine amala paul frist time pairing the family oriented and emotional movie memu. this movie censor completed and ready to release

మేము సినిమాలో ఏముంది..?

Posted: 06/24/2016 11:00 AM IST
Suriya and amala paul combination movie memu releasing soon

సూర్య, అమలాపాల్‌, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘పసంగ 2’. పాండిరాజ్‌ దర్శకుడు. తెలుగులో ‘మేము’ పేరుతో విడుదల చేస్తున్నారు. జులై 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత జూలకంటి మధుసూధన్‌ రెడ్డి మాట్లాడుతూ ‘సున్నితమైన భావోద్వేగాలకు పెద్దపీట వేసిన చిత్రమిది. తమిళంలో మంచి స్పందన వచ్చింది. తెలుగులోనూ అదే ఫలితం వస్తుందన్న నమ్మకం ఉంది.

సూర్య నటన, ఆ పాత్ర పలికే సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇంత అందమైన కథని పాండిరాజ్‌ తెరకెక్కించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొంటుంది’ అన్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని అర్రోల్‌ కొరెల్లి అందిచారు. బ్యూటిఫుల్ వ్యూజవల్స్ తో మంచి ఫీల్ తో ఈ సినిమా అందర్ని ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ మంచి కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సంవత్సరంలో 24 సినిమాలాంటి బిగ్ హిట్ సినిమా తర్వాత సూర్య సినిమా రావడం సినిమాకి మంచి ప్లస్ అవుతుందని చెప్తున్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero suriya  amala paul  bindhu madhavi  director pandiraj  pasanga movie  memu movie  

Other Articles

Today on Telugu Wishesh