హృతిక్ పిచ్చిలో బాండ్ గర్ల్ | Bond girl Caterina Murino die hard fan of Hrithik

Bond girl caterina murino die hard fan of hrithik

Bond girl, casinao royal actress, Caterina Murino, Hrithik Roshan, Caterina Murino Hritik, బాండ్ గర్ల్ హృతిక్ ఫ్యాన్, హృతిక్ మాయలో బాండ్ గర్ల్, bollywood news, telugu news

Bond girl Caterina Murino die hard fan of Hrithik Roshan.

హృతిక్ పిచ్చిలో బాండ్ గర్ల్

Posted: 06/23/2016 03:15 PM IST
Bond girl caterina murino die hard fan of hrithik

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ అంటే పడిచచ్చే అమ్మాయిల లిస్ట్ చాలా పెద్దదే. రింగుల జుట్టుతో, కండలు తిరిగిన దేహంతో హాలీవుడ్ హీరోను తలపించే బాడీ మనోడి సొంతం. అందుకే అంతర్జాతీయ నటీమణులు బార్బరా మోరీ లాంటి నటీమణులు కూడా ఇతగాడికి పర్సనాలిటీకి ఫిదా అయిపోయి పిచ్చోళ్లై పోతుంటారు. తాజాగా మరో హాలీవుడ్ సెలబ్రిటీ కూడా ఈ ఫ్యాన్ లిస్ట్ లోకి చేరిపోయింది.

బాలీవుడ్ లో రాజీవ్ ఝవేరి సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫీవర్’ చిత్రం ద్వారా ఇటాలియన్ నటి క్యాటెరీనా మ్యురినో బాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. 2006 లో వచ్చిన కాసినో రాయల్ జేమ్స్ బాండ్ చిత్రం లో ఈవిడే లీడ్ హీరోయిన్. జూలై 22న విడుదల కాబోతున్న ఫీవర్ చిత్రం కోసం ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అదే టైంలో బాలీవుడ్ గురించి తనకు బాగా తెలుసంటూ ఫోజులు కొడుతుందీ భామ.

1988లో వచ్చిన బాంబే సలాం దగ్గరి నుంచి షారూఖ్ దేవదాస్ దాకా అన్ని చిత్రాలు తనకు తెలుసంటోంది. ముఖ్యంగా జోథా అక్భర్ సినిమా ఎన్నిసార్లు చూసిందో లెక్కలేదంట. హృతిక్ రోషన్ కి భయంకరమైన ఫ్యాన్ నని చెబుతోంది. హృతిక్ నటించిన అన్ని సినిమాలు మిస్ కాకుండా చూస్తాను, అసలు అతన్ని చూస్తే ప్రేమలో పడని అమ్మాయి ఎవరైనా ఉంటారా? అంటూ తన మనసులోని ఫీలింగ్ ను బయటపెట్టేస్తుంది. ఇతర భాషల్లో నటించేందుకు నాకిప్పుడు ఎలాంటి హద్దులు లేవు. కెరీర్ కోసం ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సిద్ధమంటూ ఓపెన్ గా ప్రకటించేస్తుంది. 38 ఏళ్ల  క్యాటెరీనా మ్యురినో.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bond girl  casinao royal  Caterina Murino  Hrithik Roshan  

Other Articles