hero karthi next movie with maniratnam

Hero karthi next movie with maniratnam

hero karthi, karhti movies, karthi asst director, karthi vs maniratnam, karthi ar rehman, a r rehman combination

hero karthi next movie with maniratnam and music sittings will starts. a r rehman giving music this movie and karthi in pilot officer in this movie

అసిస్టెంట్ డైరెక్టర్ హీరోగా..!

Posted: 06/22/2016 01:55 PM IST
Hero karthi next movie with maniratnam

ఊపిరి సినిమాతో హిట్ కొట్టిన కార్తీ మంచి ఊపు మీదున్నాడు. ప్రస్తుతం కాశ్మోరా సినిమాతో బిజీగా ఉన్న కార్తీ త్వరలో మణిరత్నం తెరకెక్కించే రొమాంటిక్ ప్రేమకథకు సిద్ధమైపోతున్నాడు. ఈ సినిమాకి సంబధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడ శరవేగంగా జరిగిపోతున్నాయి.

సాహసమే శ్వాసగా సాగిపో పాటలతో సంగీత ప్రియులను అలరించిన ఏఆర్ రెహ్మాన్ మరోసారి మణిరత్నంతో కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ చేయనున్నాడు. ప్రముఖ రైటర్ వైరముత్తు లిరిక్స్ అందిస్తున్న పాటలతో మ్యాజిక్ చేయనున్నారు.

ఈ సినిమాలో కార్తీ ఒక పైలట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. కార్తీ కి జంటగా అతిథి రావ్ నటించనుంది. మణిరత్నం తన సొంత బ్యానర్ అయిన మద్రాస్ టాకీస్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఒకప్పుడు కార్తీ సినిమా హీరో కాకముందు మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇప్పుడు తన అసిస్టెంట్ డైరెక్టరే హీరోగా మారి సినిమా చేయడం సంతోషంగా ఉందని చెప్తున్నాడు చిత్ర దర్శకుడు మణిరత్నం.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero karthi movie  karthi and maniratnam  maniratnam  a r rehman  ilayaraja  

Other Articles