జవాన్ గా రాబోతున్న సాయిధరమ్ తేజ? | Sai Dharam Tej Become Jawaan

Sai dharam tej become jawaan

Sai Dharam Tej movie news, Sai Dharam Tej as jawaan, Sai Dharam Tej jawaan movie news, Sai Dharam Tej stills, Sai Dharam Tej movies, Sai Dharam Tej latest updates, Sai Dharam Tej

Sai Dharam Tej Become Jawaan: As per latest sources... Supreme hero Sai Dharam Tej upcoming film title Jawaan. bvs ravi director.

జవాన్ గా రాబోతున్న సాయిధరమ్ తేజ?

Posted: 06/08/2016 02:50 PM IST
Sai dharam tej become jawaan

వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ నటించిన ‘సుప్రీమ్’ సినిమా ఇటీవలే విడుదల మంచి విజయం సాధించింది. సాయిధరమ్ తేజ ప్రస్తుతం దర్శకుల హాట్ హీరోగా మారిపోయాడు. డాన్స్, యాక్టింగ్, యాక్షన్, కామెడీ... ఇలా అన్ని అంశాల్లో కూడా మంచి ప్రశంసలు దక్కించుకోవడంతో తేజ్ తో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు.

‘వాంటెడ్’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రచయిత బివిఎస్ రవి... ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో మళ్లీ ఓ సరైన హిట్టుకోసం కసిగా ఎదురుచూస్తున్నాడు. అయితే తాజాగా ఫిల్మ్ ఛాంబర్ లో రవి ‘జవాన్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్ ను సాయిధరమ్ తేజతో సినిమా తీయడానికేనని సినీవర్గాల సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కావాల్సి వుంది.

ఇక ప్రస్తుతం సాయిధరమ్ తేజ తన తదుపరి చిత్రం ‘తిక్క’ను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ‘తిక్క’ తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. వరుసగా తేజ్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా హిట్టవుతూ వుండటంతో మార్కెట్లో సాయిధరమ్ తేజకు మంచి డిమాండ్ ఏర్పడింది.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  Supreme  Jawaan  BVS Ravi  

Other Articles