వెయ్యిమందితో గౌతమీపుత్ర యుద్ధం | Gautamiputra Satakarni Shooting Updates

Gautamiputra satakarni shooting updates

Gautamiputra Satakarni Shooting Updates, Gautamiputra Satakarni posters, Shriya Saran in Gautamiputra Satakarni, Shriya Saran movies, బాలకృష్ణ, శ్రియ, క్రిష్, గౌతమీపుత్ర శాతకర్ణీ, Gautamiputra Satakarni shooting details, Gautamiputra Satakarni title logo, సినిమాలు, వార్తలు, రాజకీయాలు, Balakrishna movie updates, Shriya Saran latest stills, Shriya Saran hot stills, Balakrishna latest stills, Balakrishna stills, Balakrishna upcoming films, Balakrishna

Gautamiputra Satakarni Shooting Updates: Nandamuri Balakrishna's upcoming movie Gautami Putra Satakarni directed by krish jagarlamudi and produced by Saibabu Jagarlamudi & Y. Rajeev Reddy. under First First Frame Entertainment banner. music composed by Devi Sri Prasad.

వెయ్యిమందితో గౌతమీపుత్ర యుద్ధం

Posted: 06/02/2016 10:23 AM IST
Gautamiputra satakarni shooting updates

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ చిత్రం గురించి రోజుకో కొత్త వార్త వినిపిస్తూనే వుంది. ఈ సినిమా టైటిల్ లోగో, పోస్టర్ విడుదలైన క్షణం నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య అభిమానులు ఈ సినిమాపై టీజర్, టైటిల్ సాంగ్ ను కూడా రూపొందించి, సినిమాపై వున్న అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు.

దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని, రెండవ షెడ్యూల్ ను ప్రారంభించింది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ హైదరబాద్ లోని చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో వేసిన ఓ భారీ సెట్ లో షూటింగ్ జరుగుతుంది. దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో, 200 పడవలను వినియోగిస్తూ చిత్రీకరిస్తున్నారు. ఇంట్రవెల్ కు ముందు సముద్రంలో జరిగే ఈ సముద్ర యుద్ధ సన్నివేశాలకోసం చిత్రీకరిస్తున్నారు.

ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్, వార్ సీన్లు హైలెట్ గా నిలువనున్నాయి. దర్శకుడు క్రిష్ చాలా కేర్ తీసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: భూపేష్ భూపతి, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Gautamiputra Satakarni  Shriya Saran  

Other Articles