చనిపోయిన హీరోతో దర్శకుడి విజువల్ వండర్ | Nagarahavu Kannada Teaser

Nagarahavu kannada teaser

Nagarahavu Kannada Teaser, Nagarahavu Teaser, Nagarahavu stills, Nagarahavu posters, Nagarahavu movie 2016, Nagarahavu 2016, Nagarahavu latest updates, Nagarahavu

Nagarahavu Kannada Teaser: The mind boggling teaser of the epic fantasy thriller Nagarahavu is here. The film starring Vishnuvardhan, Ramya, Rajesh Vivek Upadhyay, & Mukul Dev, has music by Guru Kiran and is directed by Kodi Ramakrishna. You just cannot miss this one for the enormity of it and the stunning VFX.

చనిపోయిన హీరోతో దర్శకుడి విజువల్ వండర్

Posted: 06/01/2016 03:41 PM IST
Nagarahavu kannada teaser

దేవి, అమ్మోరు, అంజి, దేవుళ్లు, అరుంధతి వంటి గ్రాఫిక్స్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులను అందించి సీనియర్ లెజండరీ దర్శకులు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాబోతున్న మరో గ్రాఫిక్స్, విజువల్ వండర్ చిత్రం ‘నాగరహావు’. కన్నడంలో రూపొందుతున్న ఈ సినిమాలో లెజండరీ నటుడు కన్నడ స్టార్ డా.విష్ణువర్ధన్ ప్రధాన పాత్రలో నటించారు. నిజానికి విష్ణువర్ధన్ 2009లోనే మృతిచెందారు. కానీ ఈ సినిమాతో మరోసారి ఆయనను సినీ ప్రేక్షకుల ముందుకు గ్రాఫిక్స్ సాయంతో తీసుకురానున్నారు దర్శకులు కోడిరామకృష్ణ.

కానీ చనిపోయిన నటుడిని గ్రాఫిక్స్ సాయంతో ఓ పూర్తి స్థాయి సినిమాను తెరకెక్కించటం భారతీయ సినీ చరిత్రలో ఇదే తొలిసారి కావటం విశేషం. చనిపోయిన విష్ణువర్ధన్ను ఈ సినిమాలో హీరోగా చూపించటం కోసం ఏడు దేశాల్లోని 576 మంది గ్రాఫిక్స్ నిపుణులు 730 రోజుల పాటు శ్రమించారని తెలిసింది. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో హీరోయిన్ రమ్య ఓ కీలక పాత్రలో నటిస్తుంది. భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం కన్నడ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా హిట్టయ్యితే కోడి రామకృష్ణ క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarahavu  Kodi Ramakrishna  Vishnuvardhan  Ramya  

Other Articles