ఘాటుగా స్పందించిన ప్రియమణి | Priyamani talks about her marriage issue

Priyamani talks about her marriage issue

Priyamani talks about her marriage issue, Priyamani tweets, Priyamani hot stills, Priyamani Engagement pics, Priyamani Engagement Videos, Priyamani Engagement issue, Priyamani movies

Priyamani talks about her marriage issue: South indian actress Priyamani got engaged to her long-time boyfriend Mustufa Raj.

ఘాటుగా స్పందించిన ప్రియమణి

Posted: 05/31/2016 04:30 PM IST
Priyamani talks about her marriage issue

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రియమణి తన ప్రియుడు ముస్తుఫా రాజ్ ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయిన విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం వేడుక కూడా ఘనంగా జరిగింది. ఈ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో ప్రియమణి పోస్ట్ చేసింది.

అయితే ఈ ఫోటోలపై కొంతమంది సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. ప్రియమణి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముస్లిం మతానికి చెందినవాడు కావడంతో వారి ప్రేమను లవ్ జిహాద్ తో పోలుస్తూ కొంతమంది కామెంట్లు చేసారు. ఈ కామెంట్లపై ప్రియమణి సీరియస్ గా స్పందించింది.

నా జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న నన్ను దీవించండి. సోషల్ మీడియాలో వస్తున్న స్పందనలతో చిరాకువేస్తోంది. మీ సందేశాలతో మమ్మల్ని దీవించండి తప్ప.. ఇలాంటి నెగెటివ్ రియాక్షన్స్ మాత్రం ఇవ్వడం ఇప్పటికైనా మారండి. ఇది నా జీవితం.. నేను నా కుటుంబ సభ్యులకు, నేను చేసుకోబోయే వ్యక్తికి తప్ప ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ గట్టిగా సమాధానమిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyamani  Engagement stills  Hot stills  

Other Articles