మెగాస్టార్ చేతిలో ‘కొబ్బరిమట్ట’ | Chiranjeevi watches Kobbari Matta teaser

Chiranjeevi watches kobbari matta teaser

Chiranjeevi watches Kobbari Matta teaser, Kobbari Matta Teaser, Kobbari Matta Posters, Kobbari Matta Movie Stills, Kobbari Matta Movie posters, Kobbari Matta movie news, Kobbari Matta movie updates, Kobbari Matta, Sampoornesh Babu

Chiranjeevi watches Kobbari Matta teaser: Turning Sampoornesh Babu in triple action. Gayatri gupta, Geethanjali, Ishika, Sri sudha heroines. Directed by Rupak Ronaldson, Written by Steven Shankar. Produced by G. Srinivas Rao, Sai Rajesh Neelam & Adi Kumbagiri. Music is composed by Kamran.

మెగాస్టార్ చేతిలో ‘కొబ్బరిమట్ట’

Posted: 05/30/2016 09:04 AM IST
Chiranjeevi watches kobbari matta teaser

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా న‌టించిన కొబ్బ‌రిమట్ట 3 నిమిషాల టీజ‌ర్ ని ఇటీవ‌లే మెగా మెన‌ల్లుడు సుప్రీమ్ హీరో సాయిధ‌ర్మ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. విడుద‌ల‌య్యిన మ‌రుక్ష‌ణం నుండే వ్యూవ్స్ లో రికార్డు క్రియోట్ చేస్తుంది. ఇప్పటికే 10 ల‌క్ష‌ల వ్యూవ్స్ దాటి మ‌రో మైల్ స్టోన్ అందుకుంటానికి దూసుకుపోతుంది. ఇదిలా వుండ‌గా ఈ టీజ‌ర్ కి మెగాస్టార్ ఆశిస్సులు ప్ర‌శంశ‌లు ల‌భించాయి. ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు అందించిన స్టీవెన్ శంక‌ర్ మెగా అభిమానిగా సుప‌రిచితుడు కావ‌టం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి గారికి హీరో సంపూర్ణేష్ బాబు త‌న చిత్రం కొబ్బరిమ‌ట్ట టీజ‌ర్ చూపించ‌టం జ‌రిగింది. ఆ టీజ‌ర్ ని చూసిన చిరంజీవిగారు చాలా బాగుందని, కామెడిగా వుంటూ మంచి మెసెజ్ వుంద‌ని , డైలాగ్స్ రాసిన స్టీవెన్ శంక‌ర్ చాలా డెప్ట్ తో ఈ డైలాగ్స్ రాసాడ‌ని. సంపూ మాడ్యులేష‌న్ చాలా మెచ్యురిటిగా వుంద‌ని ప్రశంసించారు. అంతేకాదు టీజ‌ర్ చూస్తున్నంత‌సేపు న‌వ్వుతూనే వుండ‌టం విశేషం. ఈ చిత్రానికి త‌న బెస్ట్ విషెస్ కూడా అందించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఈ రోజు త‌ప్ప‌కుండా మా కొబ్బ‌రిమ‌ట్ట యూనిట్ అంతా పండ‌గ చేసుకోవాల్సిన రోజు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి పెరిగాను. ఆయ‌న్ని చూసి చిత్ర రంగం లోకి అడుగుపెట్టాను. ఆయ‌న‌కి వీరాభిమానిని నేను. కేవ‌లం నేనొక్క‌డినే కాదు నా కొబ్బ‌రిమ‌ట్ట చిత్ర యూనిట్ అంద‌రం అన్న‌య్య వీరాభిమానుల‌మే. మా కొబ్బ‌రిమ‌ట్ట టీజ‌ర్ ని సుప్రీమ్ హీరో సాయిధ‌ర్మ్ తేజ్ చేతుల మీదుగా విడుద‌ల కావ‌టం విశేషం అయితే ఈరోజు ఇలా మెగాస్టార్ ప్ర‌శంశ‌లు అందుకోవ‌టం మా జ‌న్మ ద‌న్య‌మైంద‌ని అనుకుంటున్నాం. మా చిత్రం విజ‌యం సాధించాల‌ని మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించిన మెగాస్టార్ చిరంజీవి గారికి మా యూనిట్ త‌రుపున ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను అని అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh Babu  Kobbari Matta  Gayatri gupta  Geethanjali  Teaser  

Other Articles