‘బ్రహ్మోత్సవం’ చూస్తే జండు బామ్ వాడాల్సిందేనా? | Brahmotsavam disappoints the audience

Brahmotsavam disappoints the audience

Brahmotsavam first talk flop, Mahesh dance reminds Comedian steps, Brahmotsavam First Review, Highlights Of Brahmotsavam, Brahmotsavam Censor Report, Brahmotsavam Songs Making, Brahmotsavam Release Date, Brahmotsavam Theaters List, Brahmotsavam Tickets, Brahmotsavam online bookings, Brahmotsavam interviews, Mahesh Babu interviews, Mahesh Babu movie, Brahmotsavam movie posters, Brahmotsavam songs, Mahesh Babu

Brahmotsavam disappoints the audience: Mahesh Babu Brahmotsavam film released today. Kajal Aggarwal, Samantha and Pranitha heroines. Directed by Srikanth Addala and music composed by Mickey J Meyer.

‘బ్రహ్మోత్సవం’ చూస్తే జండు బామ్ వాడాల్సిందేనా?

Posted: 05/20/2016 12:59 PM IST
Brahmotsavam disappoints the audience

‘బ్రహ్మోత్సవం’ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు మహేష్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొని వెళ్లిన అభిమానులకు సైతం ‘బాబోయ్.. ఎంటి ఈ సినిమా’ అని అనిపించే విధంగా వుంది. దీంతో కొంతమంది జనాలు ఫస్ట్ హాఫ్ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి ఏర్పడింది. అన్నిచోట్ల నుంచి కూడా నెగెటివ్ టాక్ వస్తోంది.

కుటుంబ బంధాలు, బంధుత్వాల గురించి ఇప్పటితరానికి కూడా తెలియజేయాలని అనుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోగా.. ఈ సినిమా చూస్తున్నంతసేపు జనాలంతా కూడా ఏదో టీవి సీరియల్ చూసినట్లుగా ఫీల్ అయ్యారు. సినిమా అంతా కూడా సాగదీసినట్లుగా అనిపిస్తోంది. ప్రేక్షకులకు కావాల్సిన యాక్షన్, కామెడీ, ఎంటర్ టైన్మెంట్ అసలే లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకే జనాలు బాబోయ్ అన్నారనుకుంటే... ‘బ్రహ్మోత్సవం’ సినిమా అంతకంటే దారుణంగా వుందని చెప్పుకోవచ్చు. ఒకవిధంగా చూసుకుంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో అయినా పలు యాక్షన్, మాస్, కామెడీ ఎంటర్ టైన్మెంట్ అంశాలతో ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెట్టగలిగింది. కానీ ‘బ్రహ్మోత్సవం’ మాత్రం సినిమా ప్రారంభం నుంచే సాగదీయడంతో జనాలు చాలా బోర్ గా ఫీలయ్యారు. దీంతో ‘బ్రహ్మోత్సవం’ సినిమా చూసే ప్రేక్షకులకు పెద్ద తలనొప్పి అని చెప్పుకోవచ్చు.

కాస్త ఎంటర్ టైన్మెంట్ కావాలనుకొని ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు వెళ్తే... ఇంట్లో కూర్చొని టీవి సీరియల్స్ చూడటమే బెటర్ అనిపించేలాగా వుంది. మహేష్ అభిమానులు సైతం ‘బ్రహ్మోత్సవం’ ఫ్లాప్ అని నిజంగా ఒప్పుకోవడం అభినందించదగ్గ విషయం. కానీ ఎన్నో ఆశలు పెట్టుకొని వెళ్లిన అభిమానులకు మాత్రం మహేష్ తన ‘బ్రహ్మోత్సవం’తో జండు బామ్ వాడేలా చేసాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మరి సినిమా టాక్ అట్టర్ ఫ్లాప్ అని వచ్చినప్పటికీ.. కలెక్షన్లు ఎలా వుండనున్నాయో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : Brahmotsavam  Mahesh Babu  Review  Kajal  Samantha  

Other Articles

Today on Telugu Wishesh