అంకుల్ మంచి కూతురును ఇచ్చారు! | Naga Shaurya Funny Speech in Oka Manasu

Naga shaurya funny speech in oka manasu

Naga Shaurya Funny Speech in Oka Manasu, Oka Manasu Audio Launch, Oka Manasu trailer, Oka Manasu stills, Oka Manasu posters, Oka Manasu, Naga Shaurya, Niharika

Naga Shaurya Funny Speech in Oka Manasu: Niharika, Naga Shaurya Oka Manasu Audio Launched.

అంకుల్ మంచి కూతురును ఇచ్చారు!

Posted: 05/19/2016 11:08 AM IST
Naga shaurya funny speech in oka manasu

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. ‘ఒక మనసు’ ఆడియో విడుదల కార్యక్రమం నిన్న మెగా కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో హీరో నాగశౌర్య మాట్లాడుతూ తెగ మెలికలు తిరిగిపోయాడు. ఇంతకుముందెప్పుడూ స్టేజ్ పైన మాట్లాడలేదేమో అన్నంత పని చేసేసాడు. మాములుగా మెగా హీరోల సినిమా ఫంక్షన్లలో అభిమానుల అరుపులు వుండటం తెలిసిందే. నిన్న కూడా మెగా అభిమానులు అదే విధంగా అరుపులు, కేకలతో అదరగొట్టేసారు. వీరి అరుపులకు నాగశౌర్య నోట్లో నుంచి మాటలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది.

నాగశౌర్య మాట్లాడినంతసేపు ఫన్నీగా మాట్లాడేసాడు. ఈ సినిమా ఎలా స్టార్టయ్యిందో తెలియదు, ఎలా ఎండయ్యిందో తెలియదు. చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యింది. మంచి స్క్రిప్ట్. రామరాజుగారు నెరేట్ చేసిన విధానమే మమ్మల్ని అక్కడి వరకు తీసుకెళ్లింది. ఈ క్రెడిట్ రామరాజుగారికే చెందుతుంది. సునీల్ కశ్యప్, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్లగారు మంచి ఆల్బమ్ ఇచ్చారు. నిహారికతో నటించడం హ్యపీగా ఉంది. నేను సావిత్రిగారి గురించి విన్నాను, తర్వాత సౌందర్య, అనుష్క గారంటే ఇష్టం. ఈ జనరేషన్ లో లేడీ ఓరియెంటెడ్ రోల్స్ చేయగల హీరోయిన్ నిహారిక మాత్రమే అవుతుందని చెప్పగలను. సాగర సంగమం, గీతాంజలి చిత్రాలు ఎలా నిలిచిపోయాయో, ఒక మనసు చిత్రం అలా నిలిచిపోతుంది. మేం గర్వంగా ఫీలయ్యే చిత్రమవుతుంది. దర్శక నిర్మాతలకు, టీం అంతటికీ థాంక్స్ అన్నారు.

ఈ మాటలన్నీ చెప్పే సమయంలో నాగశౌర్య చేసిన కామెడీ అందరినీ తెగ నవ్వించేసింది. ఇక మెగా ఫ్యామిలీ పెద్ద బట్టర్ రాసేసినట్లుగా అనిపిస్తోంది. మాటల్లో మాటలుగా ‘థ్యాంక్యూ అంకుల్(నాగబాబు).. మంచి డాటర్ ను ఇచ్చారు.. చెప్పాలంటే మంచి నటురాలు’ అని చెప్పుకొచ్చారు. నాగశౌర్య మాట్లాడుతున్నంత సమయంలో అక్కడున్న వారి హవభావాలు అందరికి ఫన్నీగా అనిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Shaurya  Oka Manasu  Niharika  Allu Arjun  

Other Articles