క్వీన్ ఒప్పుకుంటే హీరోయిన్ అవుతాడట | Irrfan khan wants to act with Kangana Ranaut

Irrfan khan wants to act with kangana ranaut

Irrfan khan wants to act with Kangana Ranaut, Irrfan khan comments on Kangana Ranaut, Irrfan khan wants Kangana, Irrfan khan upcoming films, Kangana Ranaut movies, Kangana Ranaut movie updates, Kangana Ranaut stills, Kangana Ranaut gossips, Kangana Ranaut love affair, Kangana Ranaut stills, Kangana Ranaut hot gossips, Kangana Ranaut

Irrfan khan wants to act with Kangana Ranaut: Bollywood actress Kangana Ranaut apparently declined director Sai Kabir's offer to play female lead in his upcoming film.

క్వీన్ ఒప్పుకుంటే హీరోయిన్ అవుతాడట

Posted: 05/12/2016 12:13 PM IST
Irrfan khan wants to act with kangana ranaut

నిజజీవితంలో వరుస వివాదాలతో హాట్ టాపిక్ గా మారిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్... సినిమాల విషయంలో నిజంగా క్వీన్ గానే కొనసాగుతోంది. రియల్ లైఫ్ ను రీల్ లైఫ్ తో సంబంధం లేకుండా నటిగా తన పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ, బాలీవుడ్ క్వీన్ గా కొనసాగుతోంది. ఈ అమ్మడి నటనకు ఇప్పటికే జాతీయ అవార్డులు వరుసగా ఈమె సొంతం అయ్యాయి.

అలాంటి ఈ హీరోయిన్ పక్కన నటించాలని స్టార్ హీరోలు సైతం ప్రయత్నిస్తుంటారు. అందులో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఇర్ఫాన్ ఖాన్ కూడా ఒకరు. గతంలో వీరిద్దరూ కలిసి దర్శకుడు సాయి కబీర్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందని వార్తలొచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేకపోయింది.

ఈ విషయంపై ఇర్ఫాన్ ఖాన్ ను అడగగా... కంగనా తనతో నటించేందుకు అంగీకరించకపోయినా.. ఆ విషయాన్ని తాను లైట్ గా తీసుకుంటానని.. ఆమె సినిమాలో హీరోగా నటిస్తే... తాను హీరోయిన్ గా నటించడానికి కూడా సిద్ధమేనని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ... డివైన్ లవర్స్ కథ ఇది. మధ్య తరగది కుటుంబాన్ని ప్రతిబింబించే విధంగా వుంటుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చాడు. మరి వీరిద్దరి జోడి ఎలా వుండబోతుందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  Irrfan khan  Love Affair  

Other Articles