సమంత రహస్య ప్రేమికుడు? | Samantha Secret Love Affair

Samantha secret love affair

Samantha Secret Love Affair, Samantha love affair, Samantha love story, Samantha tweets, Samantha hot stills ,Samantha hot news, Samantha movies, Samantha movie updates, Samantha stills, Samantha

Samantha Secret Love Affair: Tollywood actress Samantha latest hit film 24. Surya, Samantha, Nithya menon acts in lead roles.

సమంత రహస్య ప్రేమికుడు?

Posted: 05/11/2016 12:06 PM IST
Samantha secret love affair

హీరోయిన్ సమంత గతకొద్ది కాలంగా పలు వివాదాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలపై కామెంట్లు చేసి, అభిమానుల ఆగ్రహానికి గురయ్యింది. ఆ తర్వాత తమిళ నటుడు సిద్ధార్థతో ప్రేమాయణం కొనసాగించి, త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమో అనుకునేసరికి అతనితో విభేదాలు వచ్చి విడిపోయారు.

ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కొనసాగిస్తూ ఓ బిజినెస్ మ్యాన్ తో రహస్య ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ అమ్మడు మరో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చి హాట్ టాపిక్ గా మారింది. సూర్య హీరోగా సమంత, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘24’ చిత్రం ఇటీవలే విడుదలై సక్సెస్ టాక్ తో కొనసాగుతోంది.

ఈ సంధర్భంగా సమంత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఓ షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చింది. ‘మీరింకా సింగిల్ స్టేటస్ నే ఎంజాయ్ చేస్తున్నారా?’ అనే ప్రశ్నకు సమాధానంగా... సమంత నవ్వుతూ కాదని బదులిచ్చింది. అంతేకాకుండా తాను సింగిల్ గా వున్నానంటూ ఎవరు చెప్పారంటూ ఎదురు ప్రశ్నించింది.

ఈ అమ్మడి సమాధానంతో సమంత ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతోందని.. అయితే ఆ కొత్త రహస్య ప్రేమికుడు ఎవరా అనే విషయంపై సినీ జనాల్లో చర్చలు జరుగుతున్నాయి. మరి సమంత ప్రేమ పెళ్లికి దారి తీస్తుందో లేక మళ్లీ ‘సింగిల్ గా వుండటమే బాగుంది’ అనే డైలాగులు చేబుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Love Story  24 movie  Hot stills  

Other Articles