చచ్చిన మనిషి పోలీసులకు ఫిర్యాదు | Venu Madhav Police Complaint

Venu madhav police complaint

Comedian Venu Madhav Police Complaint, Venu Madhav angry, Venu Madhav clarifies on rumors, Venu Madhav death rumors, Venu Madhav latest news, Venu Madhav stills, Venu Madhav

Comedian Venu Madhav Police Complaint: Tollywood Comedian Venu Madhav angry on media and news channels. Venu Madhav Police Complaint against on his death rumors.

చచ్చిన మనిషి పోలీసులకు ఫిర్యాదు

Posted: 05/10/2016 05:33 PM IST
Venu madhav police complaint

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ గతకొద్ది రోజులుగా సినిమాలకే కాకుండా మీడియాకు దూరంగా వుంటున్నాడు. దీంతో వేణుమాధవ్ పై రకరకాల రూమార్లు వచ్చిపడుతున్నాయి. వేణుమాధవ్ అందరితో అతిగా ప్రవర్తిస్తున్నాడని... అందుకే అతనికి సినిమాల్లో అవకాశాలు ఇవ్వట్లేదని... వేణుమాధవ్ ఏదో ప్రాణాంతక వ్యాధి(ఎయిడ్స్)తో బాధపడుతున్నాడని అందుకే సినిమాలకు దూరమయ్యాడని వార్తలొచ్చాయి.

కానీ ఈసారి మాత్రం ఏకంగా వేణుమాధవ్ మరణించాడంటూ వార్తలు రావడంతో వేణుమాధవ్ ఖంగుతిన్నాడు. బతికున్న తనను మీడియా చంపేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ పుకార్లతో విసిగిపోయిన వేణుమాధవ్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. తాను బతికుండగానే మీడియా తనను చంపేసిందంటూ ఆయన వాపోయారు. తనను మానసిక వేధనకు గురిచేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ వేణుమాధవ్ పోలీసులను కోరారు.

అరే బ్రతికున్న మనిషిని చంపేస్తారా? మరి చచ్చిపోయిన మనిషి పోలీసులకు ఫిర్యాదు ఎలా చేస్తాడు? ఒకవేళ వేణుమాధవ్ చనిపోయినట్లుగా వచ్చిన వార్తలే నిజమైతే.. మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందేవరు? కాబట్టి... ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మకూడదని.. ఇంతకాలం ఓపికగా వున్న వేణుమాధవ్ ఎట్టకేలకు ఈ పుకార్లకు స్వస్తి పలికాడు. గతంలో తనపై వచ్చిన అన్ని వార్తలకు వేణుమాధవ్ తాజాగా తన ఫిర్యాదు ద్వారా సమాధానమిచ్చినట్లుగా అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venu Madhav  Police complaint  Stills  News  

Other Articles