కోర్టులో జబర్దస్త్ కేసు.. ఎందుకో తెలుసా? | Jabardasth Team Members in Huzurabad Court

Jabardasth team members in huzurabad court

Jabardasth team in huzurabad court, Jabardasth comedy show, Jabardasth show, Jabardasth videos, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, Fun, Entertainment, News, Gossips, Sports, Fashion, Style, Hot, Comedy, Spicy, Hotels, Tickets, Gallery

Jabardasth team in huzurabad court: Telugu Tv Comedy Show Jabardasth team in huzurabad court.

కోర్టులో జబర్దస్త్ కేసు.. ఎందుకో తెలుసా?

Posted: 05/07/2016 09:37 AM IST
Jabardasth team members in huzurabad court

గతకొద్ది కాలంగా కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను నవ్విస్తున్న ఈటీవి జబర్దస్త్ షో తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితమే. అయితే ఈ కామెడీ షోలో వల్గారిటీ కూడా బాగా ఎక్కువయ్యాయని, బూతులు ఎక్కువయ్యాయంటూ విమర్శలు వస్తూనే వున్నాయి. అయినా కూడా అవేమి పట్టించుకోకుండా ఈ షో టీం సభ్యులు కొనసాగిస్తున్నారు.

అయితే ఇటీవలే ఈ షోలోని ఓ స్కిట్ లో న్యాయవాది వృత్తిని అవమానించే రీతిలో వారు ప్రదర్శించారని హుజురాబాద్ కోర్టులో కేసు దాఖలయ్యింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ కోసం జబర్దస్త్ టీం సభ్యులు హాజరయ్యారు. జబర్దస్త్ షోలోని టీం లీడర్స్ తో పాటు మరికొంతమంది టెక్నీషియన్స్ హాజరయ్యారు.

జబర్దస్త్ షో నిర్మాత ఎం. శ్యాంప్రసాద్ రెడ్డి, న్యాయ నిర్ణేతలు నాగబాబు, రోజా, యాంకర్లు రష్మీ, అనసూయ మరియు మిగతా నటుల తరపున న్యాయవాది ముక్కెర రాజు పిటీషన్ దాఖలు చేసారు. ఈ కేసును తదుపరి విచారణకై జూన్ 30వ తేదికి వాయిదా వేసారు. మరి కోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jabardasth  Comedy Show  Roja  

Other Articles