శ్రీరస్తు కాకముందే ఆశీస్సులు కోరుతున్నాడు | Allu Sirish Next Film Updates

Allu sirish next film updates

Allu Sirish Next Film Launch Today, Allu Sirish upcoming films, Allu Sirish movie updates, Allu Sirish stills, Allu Sirish movies, Allu Sirish movie news, Allu Sirish latest stills

Allu Sirish Next Film Updates: Allu Sirish Next Film Launch Today. Allu Sirish latest film Srirastu Subhamastu. Lavanya tripati heroine. parasuram Direction. Allu Sirish Next Film under upcoming director Venu.

శ్రీరస్తు కాకముందే ఆశీస్సులు కోరుతున్నాడు

Posted: 04/28/2016 08:05 AM IST
Allu sirish next film updates

‘కొత్తజంట’ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని, ఓ మంచి కథాంశంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు అల్లు శిరీష్. ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే చిత్ర తెరకెక్కుతోంది. దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో శిరీష్ సరసన లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా విడుదల కాకముందే మరో సినిమాను ప్రారంభిస్తున్నాడు శిరీష్. నూతన దర్శకుడు ఎంవిఎన్ రెడ్డి(వేణు) దర్శకత్వంలో శిరీష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై శైలేంద్ర బాబు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నేడు ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ జులై నుంచి జరుపుకోనుందని, ఈ సినిమాకు మీ అందరి ఆశీస్సులు కావాలని శిరీష్ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Sirish  Lavanya Tripati  Srirastu Subhamastu  

Other Articles