‘కబలి’ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ | Kabali Teaser Release Date

Kabali teaser release date

Rajinikanth Kabali Teaser Launch Date, Kabali movie updates, Kabali movie news, Rajinikanth movie stills, Kabali, Rajinikanth movie news, Rajinikanth movie updates, Rajinikanth stills, Rajinikanth news, Rajinikanth stills

Kabali Teaser Release Date: Tamil super star Rajinikanth latest film Kabali. Pa. Ranjith director. Radhika apte heroine, Dhansika acts in important role.

‘కబలి’ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్

Posted: 04/28/2016 07:59 AM IST
Kabali teaser release date

‘లింగ’ వంటి ఫ్లాప్ తర్వాత తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కబలి’. ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కళైపులి ఎస్. థాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రజనీకాంత్ భార్య పాత్రలో బాలీవుడ్ హాట్ భామ రాధిక ఆప్టే నటిస్తుంది. హీరోయిన్ ధన్సిక ఓ ముఖ్యపాత్రలో నటిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, వర్కింగ్ స్టిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రజనీకాంత్ లుక్ చాలా బాగుంది. కబలీశ్వర్ అనే ఓ డాన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా తెలిసింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తన పాత్రకు రజనీకాంత్ డబ్బింగ్ కూడా చెప్పడం పూర్తిచేసాడు.

అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా నిర్మాతలు టీజర్ విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు. మే 1వ తేదిన ‘కబలి’ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగు వర్షెన్ టీజర్ ను కూడా అదే రోజున విడుదల చేయనున్నారని తెలిసింది.

ఒకవేళ అదే నిజమైతే ఏ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు బద్దలు చేయనుందో చూడాలి. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తిచేసి, జూన్ మొదటి వారంలో ఈ సినిమాను తమిళం, తెలుగు భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Kabali  Radhika Apte  Dhansika  

Other Articles

Today on Telugu Wishesh