‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ ఎక్కడిదో తెలుసా? | Stroy Writer of Gautamiputra Satakarni Stroy Writer

Stroy writer of gautamiputra satakarni stroy writer

Balakrishna Gautamiputra Satakarni Stroy Writer, Gautamiputra Satakarni Fan Made Teaser, Balakrishna speech in Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Movie First Look, Gautamiputra Satakarni Shooting updates, బాలకృష్ణ, కేసిఆర్, క్రిష్, గౌతమీపుత్ర శాతకర్ణీ, Gautamiputra Satakarni shooting details, Gautamiputra Satakarni title logo, తెలంగాణ ముఖ్యమంత్రి, సినిమాలు, వార్తలు, రాజకీయాలు, Balakrishna movie updates, Balakrishna latest stills, Balakrishna stills, Balakrishna upcoming films, Balakrishna

Stroy Writer of Gautamiputra Satakarni Stroy Writer: Nandamuri Balakrishna's upcoming movie GautamiPutra Satakarni directed by krish jagarlamudi and produced by Saibabu Jagarlamudi & Y. Rajeev Reddy. An unsung story of India's greatest warrior emperor, under their banner First First Frame Entertainment banner.and music composed by Devi Sri Prasad.

‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ ఎక్కడిదో తెలుసా?

Posted: 04/26/2016 05:53 PM IST
Stroy writer of gautamiputra satakarni stroy writer

బాలయ్య 100వ చిత్రంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమాలు ఇటీవలే టాలీవుడ్ సినీ ప్రముఖులు సమక్షంలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కెసీఆర్ గారి సమక్షంలో ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఈనాటి అఖండ భారతదేశానికి ఆనాడే అంకురార్పణ చేసిన రారాజు గౌతమీ పుత్ర శాతకర్ణి. అఖండ భారతావనిని పరిపాలించిన తొలి తెలుగు రాజైన గౌతమీ పుత్ర శాతకర్ణి జీవితాన్ని తెలుసుకుంటే రోమాంచితమవుతుంది. కృష్ణానదీ తీరాన అమరావతిని, గోదావరి తీరంలోని కరీంనగర్ జిల్లా కోటిలింగాల పల్లిని, మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ప్రతిష్ఠానపురంను రాజధానులుగా చేసుకుని పరిపాలన సాగించారు గౌతమీ పుత్ర శాతకర్ణి. అలాంటి గొప్ప వీరుడి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమే బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’.

ఇలాంటి చారిత్రాత్మక కథతో సినిమాలు తెరకెక్కించాలంటే మాటలు కాదు. అప్పటి కాలం నాటి కథ, వేషభాషలు, వస్త్రలంకారణ వంటి అన్ని అంశాల గురించి తెలిసి వుండాలి. అలాంటిది ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ కథాంశంతో సినిమా తీస్తున్నారంటే వారెవరో తెలుసుకోవాలని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమాకు సరైన సమాచారాన్ని ఓ సీనియర్ అధ్యాపకుడు తయారు చేసినట్లుగా తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేసిన ఆచార్య రంగనాయకులు ఈ ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ కథను సిద్ధం చేసారని తెలిసింది. చరిత్రపై ఎంతో అవగాహన వున్న ఆయన చరిత్రపై ఎన్నో పుస్తకాలను రాసారు. ఈ ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ పాత్ర చేయాలనుకొని, కొన్ని నెలల క్రితమే ఈ ఆచార్య రంగనాయకులు గారిని కలిసి.. శాతకర్ణీ గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని కోరడంతో.. ఆయన శాతకర్ణికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడం జరిగింది.

ఆచార్య గారు ఇచ్చిన సమాచారంతో దర్శకుడు క్రిష్ ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ స్ర్కిప్టును సిద్ధం చేసినట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. మే మొదటివారం నుండి మొరాకో లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ చిత్రానికి ర‌చ‌నా స‌హ‌కారం - భూప‌తిరాజా; మాట‌లు - సాయిమాధ‌వ్ బుర్రా; పాట‌లు - సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి; ప్రొడ‌క్షన్ డిజైన‌ర్ - భూపేష్ ఆర్.భూప‌తి; స్టిల్స్ - జీవ‌న్ రెడ్డి; డి.ఓ.పి - జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్; ఫైట్స్ - రామ్,ల‌క్ష్మణ్; డాన్స్ - బృంద‌; ఎడిటింగ్ - సూర‌జ్; సంగీతం - దేవిశ్రీప్రసాద్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - కొమ్మినేని వెంక‌టేశ్వర‌రావు; నిర్మాత‌లు - వై రాజీవ్ రెడ్డి, జాగ‌ర్లమూడి సాయిబాబు; ర‌చ‌న - ద‌ర్శక‌త్వం - జాగ‌ర్లమూడి రాధాకృష్ణ (క్రిష్).

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Gautamiputra Satakarni  Teaser  

Other Articles