ఆరోజున ఒకరికోసం మరొకరు వస్తారా? | Chiranjeevi and Pawan kalyan film latest updates

Chiranjeevi and pawan kalyan film latest updates

Chiranjeevi 150 film latest updates, Chiranjeevi with Pawan Kalyan, Megastar Chiranjeevi 150 film title fixed, Chiranjeevi 150 film updates, Chiranjeevi 150 film news, Chiranjeevi 150 film details, Chiranjeevi, Pawan kalyan

Chiranjeevi and Pawan kalyan film latest updates: Megastar Chiranjeevi 150th film latest updates, details, news. VV Vinayak director, Ram Charan Producer, DSP music.

ఆరోజున ఒకరికోసం మరొకరు వస్తారా?

Posted: 04/26/2016 12:06 PM IST
Chiranjeevi and pawan kalyan film latest updates

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతకొద్ది కాలంగా సెట్స్ పైకి వెళ్లకుండా సరైన కథ దొరకాలి అంటూ ఆలస్యం చేసిన చిరంజీవి... తమిళ ‘కత్తి’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథను తెలుగు నేటివిటికి తగ్గట్లుగా మార్పులు చేసేందుకు మరికొంత ఆలస్యం అయ్యి.. చివరకు ఈ నెల చివర్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమయ్యింది.

చిరంజీవి హీరోగా రూపొందనున్న ఈ సినిమాకు మాస్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. రాంచరణ్ తన సొంత బ్యానర్ పై నిర్మించనున్నారు. ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఏప్రిల్ 29న మధ్యాహ్నం 1:30 నిమిషాలకు జరపడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ లతో పాటు పలువురు మెగా హీరోలు పాల్గొననున్నారని తెలిసింది. కానీ ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ మాత్రం హాజరుకావడంలేదని తెలుస్తోంది.

ఎందుకంటే అదేరోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కూడా ప్రారంభం కానుంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు ఎస్.జే.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందబోతుంది. ‘హుషారు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాను కూడా ఏప్రిల్ 29న ప్రారంభించబోతున్నారని తెలిసింది. ఒకవేళ అదే నిజమైతే చిరంజీవి సినిమా కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరుకాడని అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఏప్రిల్ 29న ప్రారంభమైతే మెగా, పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు వుండవని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Pawan kalyan  150 film updates  

Other Articles