ఆరోజే ‘బ్రహ్మోత్సవం’ చిందులు | Brahmotsavam Music Launch Updates

Brahmotsavam music launch updates

Brahmotsavam Audio Release Date, Brahmotsavam Movie Overseas Rights News, Brahmotsavam Movie updates, Brahmotsavam Movie stills, Brahmotsavam Movie trailers, Brahmotsavam movie news, Brahmotsavam Movie shooting, Brahmotsavam Movie cast, Brahmotsavam, Mahesh babu, Samantha, Kajal, Praneetha

Brahmotsavam Music Launch Updates: Mahesh babu upcoming film Brahmotsavam under Srikanth addala direction. Samantha, Kajal, Praneetha heroines. PVP producer.

ఆరోజే ‘బ్రహ్మోత్సవం’ చిందులు

Posted: 04/25/2016 05:22 PM IST
Brahmotsavam music launch updates

‘శ్రీమంతుడు’ వంటి హిట్ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, మహేష్ కాంబినేషన్లో వస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు మిక్కీజే.మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బ్రహ్మోత్సవం’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఆడియో విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఆడియోను తిరుపతిలో విడుదల చేస్తారని వార్తలొచ్చాయి. కానీ ఈ సినిమాను హైదరాబాద్ లోనే ఆడియో విడుదల చేయబోతున్నారని తెలిసింది. మే 1వ తేదిన హైదరాబాద్ లో ఘనంగా ఈ పాటల విడుదల కార్యక్రమం చేయనున్నారు.

ఈ ఆడియో వేడుకలో ‘బ్రహ్మోత్సవం’ థియేటర్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారని సమాచారం. ఈ సినిమా కోసం మిక్కీ.జే.మేయర్ మరోసారి బ్యూటీఫుల్ మ్యూజిక్ ను అందించాడని తెలిసింది. ఇందులో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీతలు జతకట్టారు. పివిపి బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Brahmotsavam  Samantha  Kajal  Praneetha  

Other Articles