కలెక్షన్ల రికార్డుల్లో ‘ది జంగిల్ బుక్’ | The Jungle Book record collections

The jungle book record collections

The Jungle Book collections in north america, The Jungle Book, Collections, Mogli, ది జంగిల్ బుక్, మోగ్లీ, కలెక్షన్లు, Hollywood, gossips, news, photos, వార్తలు, రాజకీయాలు, సినిమాలు, టికెట్లు, show timings, songs, online

The Jungle Book record collections: The Jungle Book is a 2016 American fantasy adventure film, directed by Jon Favreau from a screenplay by Justin Marks, and produced by Walt Disney Pictures.

హాలీవుడ్ కలెక్షన్ల రికార్డుల్లో ది జంగిల్ బుక్

Posted: 04/19/2016 12:23 PM IST
The jungle book record collections

ఈనెల 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘ది జంగిల్ బుక్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. విజువల్ వండర్ గా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇందులో నటించిన కుర్రోడితో పాటు ఇతర జంతువుల ఎమోషన్ ను కూడా చాలా చక్కగా చూపించారు. సినిమా విడుదలైన తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి 680 కోట్ల రూపాయల ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఇండియాలో విడుదలైన 10 రోజుల్లో 100కోట్ల మార్క్ దాటింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 1588 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. హాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ‘ది జంగిల్ బుక్’ మూడవ స్థానంలో నిలిచింది.

జాన్ ఫావ్ రియో స్వీయదర్శక నిర్మాణంలో రూపొందిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ చిత్రాన్ని.. ‘జంగిల్ బుక్’ కథ సారాంశం ఆధారంగా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు. ఈ పాత్రకు ప్రశంసలు అందుతున్నాయి. మరి భవిష్యత్తులో ఈ చిత్రం ఇంకెన్ని కలెక్షన్లు రాబట్టనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : The Jungle Book  Mogli  Collections  

Other Articles