Indira Gandhi biopic starring Vidya Balan stuck due to legal issues

Vidya balan s indira gandhi biopic stuck due to legal issues

Indira Gandhi, Biopic, Manish Gupta, Vidya Balan, Indira Gandhi biopic, Vidya Balan Indira Gandhi, former Prime Minister Indira Gandhi, emergency,

Vidya Balan is all set to star as Indira Gandhi in a biopic on India’s former Prime Minister. According to sources, the movie directed by Manish Gupta has been stuck due to legal issues.

ఎమర్జెన్సీ అంశంతో ‘ఇందిరా’ జీవిత కథా చిత్రమ్

Posted: 04/03/2016 11:33 AM IST
Vidya balan s indira gandhi biopic stuck due to legal issues

భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ జీవిత గాథను సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నారని గత ఏడాది వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర రచయిత, దర్శకుడుకు మనీష్ గుప్తా.. ఇందిరాగాంధీ హయాంలో ఎదుర్కోన్న ఎమర్జెన్సీ అంశాన్ని కూడా చిత్రంలో పోందుపర్చనున్నామని చెప్పారు. తొలుత సుచిత్ర సెన్ ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చిన.. తాజాగా నటి విద్యాబాలన్ నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల తెలుపుతున్నాయి.

ఇందిరాగాంధీ ప్రాత పోషణ కోసం విద్యాబాలన్ ను సంప్రదించగా, అమెకు ఈ ఐడియా చాలా నచ్చిందని తెలిపారు. అమె సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. ‘ఎమర్జెన్సీ’ విధించిన పరిస్థితులపై చర్చించి అవసరమైన మార్పులు చేయాల్సి ఉండటం, అనుమతులు తీసుకోవడంతో నిర్మాణం కొంచెం ఆలస్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ చిత్రంలో ఏయే అంశాలను పోందుపర్చుతున్నామో, వేటిని పరిగణలోకి తీసుకోమే ఇప్పుడే తాము వెల్లడించలేమని ఆయన చెప్పారు.

కాగా ఈ తరహా చిత్రాలు చేయడం చాలా ఇబ్బందికరమేనని అంగీకరించారు, అయితే చిత్ర నిర్మాణ జాప్యానికి కారణాలైన అంశాలపై తాము దృష్టి సారించామని చెప్పారు. తమ ప్రాజెక్టుపై రమారమి సానుకూలంగా పవనాలు వస్తున్నాయన్నారు. అన్ని అనుకన్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టే అవకాశాలు వున్నాయన్నారు. చిత్రంలోని పూర్తి భాగం దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైతో పాటు ఇతర నగరాల్లో ఈ చిత్రం షూటింగ్ ఉంటుందని మనీష్ గుప్తా పేర్కొన్నారు.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles