Kalasudha Ugadi Awards | Winners List | NTR | Anushka

Kalasudha ugadi awards winners

Kalasudha Ugadi Awards Winners List, Kalasudha Ugadi Awards, Ntr Best actor award, Anushka Kalasudha Ugadi Award, Kalasudha Ugadi Awards list

Kalasudha Ugadi Awards Winners: Young tiger ntr gets a Kalasudha Ugadi Best Actor Award for Temper film. Best Actress Anushka for Rudhramadevi.

ఉత్తమ నటీనటులుగా ఎన్టీఆర్, అనుష్కలకు కళాసుధ అవార్డులు

Posted: 04/02/2016 03:07 PM IST
Kalasudha ugadi awards winners

ఒకే వేదికపై పలు అవార్డులు, పురస్కారాలతో సత్కరించేందుకు ఉగాది పండగ కారణం కానుంది. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే 8వ తేదీన చెన్నైలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా ప్రముఖ సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ కు ‘బాపు రమణ’ పురస్కారం, సీనియర్‌ నటి ఆమనికి ‘బాపు బొమ్మ’ పురస్కారం అందజేయనున్నారు. ఇక ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవ హక్కుల కమిషన చైర్మన్ జస్టిస్‌ టి.మీనాకుమారికి, ఎలికో హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వనిత దాట్లకు ‘మహిళా రత్న’ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

సినీరంగానికి చెందిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతికవర్గ నిపుణులకు పురస్కారాలు అందజేయనున్నారు. వాటి వివరాలు...

ఉత్తమ నటుడు - ఎన్టీఆర్‌ (టెంపర్‌)

ఉత్తమ నటి - అనుష్క (రుద్రమదేవి)

ఉత్తమ ప్రతినాయకుడు - దగ్గుపాటి రానా (బాహుబలి)

స్పెషల్‌ జ్యూరి అవార్డ్స్‌ - నిత్యామీనన్ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)

శర్వానంద్‌ - (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)

శివాజీ రాజా - (శ్రీమంతుడు)

ఉత్తమ సహాయ నటుడు - పోసాని కృష్ణమురళి(టెంపర్‌)

ఉత్తమ సహాయ నటి - హేమ (కుమారి 21 ఎఫ్‌)

ఉత్తమ హాస్యనటుడు - పృథ్వి (శంకరాభరణం)

ఉత్తమ నూతన నటుడు - అక్కినేని అఖిల్‌ (అఖిల్‌)

ఉత్తమ నూతన నటి - ప్రజ్ఞ జైస్వాల్‌ (కంచె)

ఉత్తమ చిత్రం - శ్రీమంతుడు (మైత్రి మూవీ మేకర్స్‌)

ఉత్తమ సంచలనాత్మక చిత్రం - బాహుబలి (శోభు యార్లగడ్డ)

ఉత్తమ కథ - జాగర్లమూడి రాధాక్రిష్ణ (క్రిష్‌)(కంచె)

ఉత్తమ కళా దర్శకుడు - ‘పద్మశ్రీ’ తోట తరణి (రుద్రమదేవి)

ఉత్తమ కథనం - క్రాంతి మాధవ్‌ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)

ఉత్తమ దర్శకుడు - కొరటాల శివ (శ్రీమంతుడు)

ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీప్రసాద్‌ (s/0 సత్యమూర్తి, శ్రీమంతుడు)

ఉత్తమ ఛాయాగ్రహకుడు - సెంథిల్‌ కుమార్‌ (బాహుబలి)

ఉత్తమ మాటల రచయిత - సాయిమాధవ్‌ బుర్రా (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె,
గోపాల... గోపాల, దొంగాట)

ఉత్తమ పాటల రచయిత - సిరివెన్నెల సీతారామశాస్త్రి (రుద్రమదేవి)

ఉత్తమ గాయకుడు సాగర్‌ - (s/0 సత్యమూర్తి, శ్రీమంతుడు)

ఉత్తమ గాయని - రమ్య బెహరా (బాహుబలి)

ఉత్తమ నూతన దర్శకుడు - వంశీకృష్ణ (దొంగాట)

ఉత్తమ బాల నటి - జ్వాల మేఘన (గోపాల... గోపాల)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalasudha Ugadi Awards  Winners List  NTR  Anushka  stills  

Other Articles