Oopiri | Collections | Nagarjuna | Karthi | Thozha

Oopiri movie collections in us

Oopiri Collections in US, Oopiri collections, Oopiri latest updates, Oopiri movie records, Thozha Collections, Oopiri trailers, Oopiri movie, Oopiri videos

Oopiri movie Collections in US: Akkineni nagarjuna latest film Oopiri got positive talk. Successfully running in all shows. Vamsi paidipally director. pvp producer.

మిలియన్ మార్క్ తో అదరగొడుతున్న ‘ఊపిరి’

Posted: 03/31/2016 09:41 AM IST
Oopiri movie collections in us

అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ‘ఊపిరి’ చిత్రం ఇటీవలే తెలుగు, తమిళం భాషలలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో కొనసాగుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని పివిపి సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. పాజిటివ్ టాక్ తో కొనసాగుతున్న ‘ఊపిరి’ కలెక్షన్ల మోత మోగిస్తుంది.

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతోంది. తాజాగా ‘ఊపిరి’ యుఎస్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ మార్క్ దాటేసి అదరగొడుతోంది. ఈ వార్త అటు అక్కినేని అభిమానులతో పాటు, ఇటు యువ హీరోలకు సైతం మంచి ఉత్సాహం పెంచిందని చెప్పుకోవచ్చు.

ఇప్పటివరకు ‘ఊపిరి’ చిత్రం యుఎస్ లో 1,005,739డాలర్లు (సుమారు 6.67కోట్ల రూపాయలు) వసూలు చేసి నాగార్జున కెరీర్‌కు ‘మనం’ తర్వాత యూఎస్‍లో మరో 1 మిలియన్ తెచ్చిపెట్టింది. ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ‘ఊపిరి’తో హ్యట్రిక్ హిట్ ను సొంతం చేసుకొని, యుఎస్ లో నాగార్జున తన క్రేజ్ ను భారీగా పెంచేసాడు. ఈ చిత్రానికి గోపిసుందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oopiri  Collections  Records  Nagarjuna  Karthi  

Other Articles