Priyanka Chopra | angry | bollywood | Hot stills

Priyanka chopra fired on bollywood mark

Priyanka Chopra angry on bollywood mark, Priyanka Chopra fired, Priyanka Chopra serious, Priyanka Chopra latest news, Priyanka Chopra hot photoshoot, Priyanka Chopra stills, Priyanka Chopra updates, Priyanka Chopra

Priyanka Chopra fired on bollywood markPriyanka Chopra angry on bollywood mark: Bollywood star heroine Priyanka Chopra angry on her bollywood mark. Priyanka Chopra latest news, gossips, stills, gallery.

బాలీవుడ్ మార్క్ మీద ప్రియాంక ఆవేదన

Posted: 03/24/2016 09:58 AM IST
Priyanka chopra fired on bollywood mark

ప్రతి ఇండస్ట్రీకి ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. తెలుగు (టాలీవుడ్), తమిళం (కోలీవుడ్), మలయాళం (మాలీవుడ్), కన్నడం (శాండల్ వుడ్), హిందీ (బాలీవుడ్) అంటూ తమ భాషతో కాకుండా ఇలాంటి పేర్లతో పిలుస్తున్నారు. కానీ మొత్తానికి ఇవన్నీ కూడా ఇండియాలోనే వున్నాయి. మరి ఒక ఇండియన్ స్టార్.. ఇతర దేశాల్లో నటిస్తే అపుడు వాళ్లను ఏమని పిలుస్తారు? బాలీవుడ్ స్టార్, టాలీవుడ్ స్టార్ అంటూ పిలవలా? కాదు.. కేవలం ఇండియన్ స్టార్ గానే గుర్తించాలి అంటూ తన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజుకు ఎదిగిన ఈ అమ్మడికి... హాలీవుడ్ లో ప్రస్తుతం వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే ప్రియాంక చోప్రా ‘క్వాంటికో’ అనే సిరీస్ తో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరిస్ తో ప్రియాంక హాలీవుడ్ లో కూడా మంచి మార్కులు కొట్టేసింది. కానీ తనపై ఇంకా బాలీవుడ్ ‘మార్క్’ వుండటంతో అసహనంగా వుందని చెబుతోంది ప్రియాంక.

తనను కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే చెందిన స్టార్ గా పరిమితం చేయవద్దని, తనకు ఆ ముద్ర వుండటం ఇష్టం లేదని ప్రియాంక పేర్కొంది. తాను బాలీవుడ్ హీరోయిన్ గా కాకుండా, భారతీయ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ గా గుర్తించాలని... ఇలా కేవలం ఓ ప్రాంతానికి చెందిన ఇండస్ట్రీకి తన పరిధిని నిర్ణయించడం నచ్చలేదని ఆమె చెబుతోంది.

హాలీవుడ్ నటులను ఫ్రెంచ్ నటుడు, స్పెయిన్ నటుడు అంటూ ప్రత్యేకంగా పిలవరు కదా! అక్కడ లేని ఈ తీరు భారత్ లో మాత్రం ఎందుకు కనిపిస్తోందంటూ ప్రశ్నించింది. మరి ఇప్పటికే ప్రియాంక చోప్రా ఆవేదనను అర్ధం చేసుకొని, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నటిగా గుర్తిస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Angry  Hollywood movies  hot stills  

Other Articles