Vishal | temper remake | ntr | Movie news

Vishal in temper remake

Vishal in tamil temper remake, Vishal in temper remake, temper tamil remake, Temper tamil producers, Vishal movie news, vishal movie stills, Temper tamil updates, stills

Vishal in temper remake: Ntr latest hit film temper going to remake in tamil. vishal hero and nallamalupu bujji, tagore madhu, bandla ganesh producers.

విశాల్ హీరోగా టెంపర్ రీమేక్

Posted: 03/19/2016 10:03 AM IST
Vishal in temper remake

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి కమర్షియల్‌ విజయాలతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న విశాల్ హీరోగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి సూపర్ డూపర్ హిట్ అయిన ‘టెంపర్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో నల్లమలుపుబుజ్జి, ఠాగూర్ మధు, బండ్ల గణేష్ లు నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు మాట్లాడుతూ.... తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందిరికీ తెలసిందే. ఎన్టీఆర్ అద్భుతమైన నటనకు బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళంలో విశాల్ హీరోగా రీమేక్ చేయనున్నాం. పందెంకోడి, పొగరు వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలతో తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మాస్ ఇమేజ్ తెచ్చుకున్న విశాల్ తో ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించనుండటం చాలా హ్యపీగా ఉంది. విశాల్ కు కొత్త బాడీ లాంగ్వేజ్ ను ఆపాదించే చిత్రంగా ఈ చిత్రం ఓ ట్రేడ్ మార్క్ క్రియేట్ చేస్తుందని కచ్చితంగా చెప్పగలను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరోయిన్, దర్శకుడు సహా ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal  Temper  remake  stills  

Other Articles