Sardaar Gabbar Singh | Hindi Teaser | Audio Release Date | Pawan Kalyan | Teaser

Sardaar gabbarsingh official hindi teaser

Sardaar Gabbarsingh Hindi Teaser, Sardaar Gabbarsingh Teaser, Sardaar Gabbar Singh shooting stills, Sardaar Gabbar Singh overseas rights sold out, Sardaar Gabbar Singh Audio Release Date, Sardaar Gabbar Singh Teaser Pawan kalyan Sardaar Gabbar singh Bike, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Sardaar Gabbarsingh Official Hindi Teaser: Power star pawan kalyan latest film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

తెలుగు కంటే ‘సర్దార్’ హిందీ టీజర్ సిరిగిపోయింది!

Posted: 03/17/2016 04:48 PM IST
Sardaar gabbarsingh official hindi teaser

ఈరోజు పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారని చెప్పుకోవచ్చు. అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా టీజర్ ను ఈరోజు విడుదల చేసారు. తెలుగులో విడుదలైన ఈ టీజర్ అభిమానులకు పిచ్చి పిచ్చిగా నచ్చేసినప్పటికీ... మిగతా ప్రేక్షకులకు మాత్రం కాస్త పర్వాలేదనిపించే విధంగా వుంది.

కానీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా రాబోతున్న విషయం తెలిసిందే. అందుకే హిందీ వర్షెన్ కోసం స్పెషల్ టీజర్ ను రెడీ చేసి, తాజాగా విడుదల చేసారు. తెలుగు టీజర్ కంటే హిందీ టీజర్ బాగుంది. ఒకరకంగా చెప్పుకోవాలంటే బాలీవుడ్ లో పవర్ స్టార్ ‘సర్దార్’ సినిమాకు సరైన టీజర్ అని చెప్పుకోవచ్చు.

ఇక హిందీ టీజర్ ను చూసిన పవర్ స్టార్ అభిమానులు ఫుల్ జోష్ లో వున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడం ఖాయమనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సౌత్ ఇండియన్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల 20న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాయ్ లక్ష్మీ, సంజన ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు. మరి ‘సర్దార్’ టీజర్ ఇలా వుందంటే.. ట్రైలర్, పాటలు ఎలా వుండబోతున్నాయో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles