Shah Rukh Khan | FAN | Trailer | Jabra Fan Song | Stills

Shah rukh khan fan telugu song anthem

Shah Rukh Khan Telugu FAN Song Anthem, Shah Rukh Khan FAN Trailer, Jabra FAN Anthem Song, Shah Rukh Khan FAN Teaser, Shah Rukh Khan Fan movie stills, Shah Rukh Khan latest news, Shah Rukh Khan stills, Shah Rukh Khan

Shah Rukh Khan FAN Telugu Song Anthem: Listen to the Telugu version of the Jabra #FanAnthem sung by Nakash Aziz & we bet you will become a 'Veera' FAN.

సౌత్ లో రచ్చ చేస్తున్న షారుక్ ‘ఫ్యాన్’

Posted: 03/17/2016 11:57 AM IST
Shah rukh khan fan telugu song anthem

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన కొత్త సినిమాను ప్రమోషన్లో భాగంగా అన్ని ఇండియాలోని పలు భాషలలో విడుదల చేసి, సందడి చేస్తున్నాడు. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘జబ్రా ఫ్యాన్’ సాంగ్ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో మంచి రికార్డులను క్రియేట్ చేసింది.

అయితే మొదట కేవలం హిందీలోనే విడుదల చేసిన ఈ పాటను తాజాగా తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, భోజ్ పురి, పంజాబీ భాషలలో విడుదల చేసాడు. ఈ పాటలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. పాట కూడా చాలా ఎనర్జిటిక్, జోష్ గా వుండటంతో భారీ స్పందన వస్తోంది. దీంతో షారుక్ ‘ఫ్యాన్’ సినిమాకు భారీ ప్రమోషన్ అయ్యినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో అభిమాని గౌరవ్, హీరో అర్యన్ ఖాన్ పాత్రలో షారుక్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఆర్యన్ ఖాన్ అంటే పిచ్చి, చివరకు ఆర్యన్ కు వీరాభిమానిగా మారుతాడు. ఆర్యన్ కు తన అభిమానాన్ని చూపించే ప్రయత్నంలో గౌరవ్ కొన్ని పనులు చేస్తుంటాడు. అవి ఆర్యన్ కు నచ్చకపోగా.. మీలాంటి అభిమానుల కోసం తానెందుకు సమయం కేటాయించాలంటూ ఆర్యన్ ఘాటుగా స్పందిస్తాడు. అసలే కాస్త ఆర్యన్ ఖాన్ వలే వుండే గౌరవ్ కు అభిమానం దెబ్బతింటుంది. దీంతో గౌరవ్ లేకుండా ఆర్యన్ లేడు అనే విధంగా నిరూపించాలని ప్రయత్నిస్తాడు. ఇందుకోసం ఆర్యన్ ఖాన్ కు గౌరవ్ చుక్కలు చూపిస్తాడు.

ట్రైలర్ చాలా ఆసక్తిగా వుంది. గౌరవ్, ఆర్యన్ ఖాన్ ల మధ్య ఎలాంటి వార్ జరుగబోతుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ చిత్రాన్ని వేసవి సెలవుల్లో ఏప్రిల్ 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో, అభిమానులకు ఎలాంటి ఆనందాన్ని అందిస్తుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Telugu FAN Song  Trailer  Jabra Fan Song  Stills  

Other Articles